సినిమాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్న యువతులకు గాలం వేశారు. సినిమాల్లో అవకాశం కల్పిస్తామంటూ నమ్మించారు. నిజమని నమ్మిన యువతులను వ్యభిచార కూపంలోకి తోసేశారు. ఈ వ్యవహారమంతా ఓ సినీ దర్శకుడి భార్య చేయించడం గమనార్హం.  ఈ సంఘటన తమిళనాడులో చోటుచేసుకోగా... ఈ వ్యభిచార దందా వ్యవహారం గుట్టును పోలీసులు రట్టు చేశారు.

చెన్నైలోని స్థానిక విరుగం బాక్కంలోని ఓ కాలనీ రెసిడెన్షియల్‌ ప్లాట్‌లో సినీ సహా యనటీమణులతో వ్యభిచార గృహం నడుపు తున్న సినీ దర్శకుడి భార్యను పోలీసులు అరెస్టు చేశారు. ఆ కాలనీ లో వ్యభిచారం జరుగుతోందంటూ అందిన సమా చారం మేరకు సినీ దర్శకుడి భార్య నివసిస్తున్న ప్లాట్‌లో పోలీ సులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఆ సంద ర్భంగా ఓ విటుడితో ఉన్న ఓ సహాయనటిని నిర్బంధించి మైలాపూరులోని స్త్రీ సంరక్షణ కేంద్రానికి తరలించారు.