ముంబై: మహారాష్ట్రలోని థానేలో నీచమైన సంఘటన చోటు చేసుకుంది. 17 ఏళ్ల బాలికపై తండ్రితో పాటు ఆమె బాయ్ ఫ్రెండ్ పలుమార్లు అత్యాచారం చేశారు. దాంతో బాలిక గర్భం దాల్చింది. పోలీసులు అందుకు సంబంధించిన వివరాలను అందించారు. 

థానే జిల్లాలోి వాసింద్ పట్టణంలో మూడు రోజుల క్రితం రోడ్డు పక్కన పడి ఉన్న పిండాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు విచారణ చేపట్టిన పోలీసులు ఆ పిండం ఓ బాలికకు సంబంధించిందిగా గుర్తించారు. ఆ తర్వాత బాలికను విచారించారు. 

విచారణలో బాలిక దిగ్భ్రాంతి గొలిపే విషయాలను చెప్పింది. ఉపాధ్యాయుడిగా పనిచేసే తన తండ్రి (51)తో పాటు ప్రియుడు (21) తనపై పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపింది. దాంతో బాధితురాలి తండ్రితో పాటు ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితులకు డిఎన్ఏ పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. 

గతంలో నవి ముంబైలోని పన్వేల్ లో బాలిక కుటుంబం నివసించేది. 21 ఏళ్ల నిందితుడు వారి ఇంటి పక్కనే ఉండేవాడు. దీంతో అతనికి బాలికతో పరిచయం ఏర్పడింది. వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడింది. 

అతనితో సంబధాన్ని ఇష్టపడని బాలిక కుటుంబం వాసింద్ కు మారింది. అ.యినప్పటికీ బాధితురాలు, ఆమె ప్రియుడు కలుసుకుంటూ ఉండేవారు.