హైదరాబాద్ లో మండుటెండలు ... నగరంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏడు ప్రాంతాలివే..!
దేశవ్యాప్తంగా ఈసారి ఎండల తీవ్రత అధికంగా వుంది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోనూ ఎండలు మండిపోతున్నాయి. అయితే నగరంలోని ఓ ఏడు ప్రాంతాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... అవేంటో చూద్దాం...
summer heat
హైదరాబాద్ : వామ్మో... ఎండలు మండిపోతున్నాయి... ఇంట్లోంచి కాలు బయటపెట్టాలంటే ప్రజలు భయపడిపోతున్నారు. 'సూరీడూ... ఎందుకిలా నిప్పులు కక్కుతున్నావు. మాపై దయ లేదా'అని ప్రజలు వేడుకునే పరిస్థితి వచ్చింది. పచ్చని పొలాలు, చుట్టూ చెట్లతో వుండే పల్లెటూళ్లలోనే ఎండలు ఠారెత్తిస్తున్నాయి... ఇక పట్నాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లోనూ సమ్మర్ హీట్ ఘాటెక్కిస్తోంది. ఈ ఎండలకు పొల్యూషన్ తో కూడిన వేడిగాలులు తోడవడంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. మద్యాహ్నం సమయంలో రోడ్లు నిప్పుల కొలిమిలా మారిపోతున్నాయి.
Hderabad
అయితే ప్రస్తుతం హైదరాబాద్ లో కొనసాగుతున్న ఎండలపై అర్బన్ ల్యాబ్ సంస్థ పరిశోధన జరిపింది. ఈ క్రమంలో హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలను ఆ సంస్థ గుర్తించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హైదరాబాద్ లో కంటే శివారు ప్రాంతాల్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తేలింది. గత మార్చిలో నిర్వహించిన పరిశోధనల ప్రకారం 7 ప్రాంతాలను అర్బన్ హీట్ ఐలాండ్స్ గా తేల్చారు.
Hyderabad
హైదరాబాద్ లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతాలివే :
1. పటాన్ చెరు :
హైదరాబాద్ శివారులోని పటాన్ చెరు భారీ పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడ ఏర్పాటయిన పరిశ్రమల కారణంగా వాతావరణం పూర్తిగా కాలుష్యం అయిపోయింది. అయితే ఇదే ఇప్పుడు ఎండల తీవ్రత అధికంగా వుండటానికి కారణంగా తెలుస్తోంది.
Hyderabad
2. గచ్చిబౌలి :
హైదరాబాద్ లో ఐటీ సంస్థలు అత్యధికంగా కొలువైన ప్రాంతాల్లో గచ్చిబౌలి ఒకటి. ఇక్కడ భారీభారీ భవనాల నిర్మాణాలున్నాయి. ఒకప్పుడు చెట్లతో నిండిన ప్రాంతాలు ఇప్పుడు బిల్డింగ్స్ తో నిండిపోయాయి. దీంతో ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hyderabad
3. బండ్లగూడ :
హైదరాబాద్ శివారులోని బండ్లగూడ కూడా చాలా వేగంగా అభివృద్ది చెందుతోంది. శివారు ప్రాంతం కావడంతో అపార్ట్ మెంట్ కల్చర్ వచ్చేసింది. దీంతో చెట్లను నరికేసి పంటపొలాలను అపార్ట్ మెంట్స్, విల్లాలుగా మార్చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
Hyderabad
4. మైలార్ దేవ్ పల్లి :
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లిలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిహెచ్ఎంసి పరిదిలోని ఈ ప్రాంతంలో ఎండలు మండిపోతూ ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
Hyderabad
5. బీఎన్ రెడ్డి నగర్ :
హైదరాబాద్ శివారులో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న మరో ప్రాంతం బిఎన్ రెడ్డి నగర్. ఇక్కడ కూడా ఎండల తీవ్రత అధికంగా వుంది.
Hyderabad
6. మన్సూరాబాద్ :
ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతోంది. దీంతో ప్రకృతి విధ్వంసం జరిగి ఎండత తీవ్రత పెరుగుతోంది.
Hyderabad
7. హయత్ నగర్ :
హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో కూడా ఎండలు మండిపోతున్నాయి. ఇక్కడ కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.