సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మను రాత్రికి రాత్రి సెలవుపై పంపడంపై కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అలోక్ సెలవుపై కేంద్రం వెలువరించిన నోటీఫికేషన్‌ను కొట్టివేసిన ధర్మాసనం అలోక్ వర్మకు తిరిగి బాధ్యతలు కట్టబెట్టింది.

అయితే వివాదం సద్దుమణిగే వరకు అలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది. అయితే ఆయన పునర్నియామకంపై తదుపరి నిర్ణయాన్ని సెలక్షన్ కమిటీకి వదిలేసింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత ఉంటారు.

ఈ క్రమంలో జస్టిస్ సిక్రీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయ్ కమిటీ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో జస్టిస్ సిక్రీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఉంటారు.

ఈ కమిటీ వారంలోగా సమావేశం కానుంది. మరోవైపు అలోక్ వర్మ పదవి కాలం ఈ నెల 31తో పూర్తి కానుంది. ఆలోగా సుప్రీం తుది నిర్ణయం వెలువడకపోవచ్చునని, కమిటీ సమావేశమై ఆయనకు ఉద్వాసన పలికితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీబీఐ వివాదంలో మోడీకి షాక్.. అలోక్‌ను విధుల్లోకి తీసుకోవాలన్న సుప్రీం

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా