కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) వివాదంలో కేంద్రప్రభుత్వానికి చుక్కెదురైంది.. అలోక్ వర్మను సెలవుపై పంపడం కుదరదని సుప్రీంకోర్టు తుదితీర్పు వెలువరించింది. అలోక్ వర్మను సెలవుపై పంపుతూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను తప్పుబట్టిన సుప్రీం... ఆయనను సెలవుపై పంపుతూ కేంద్రం జారీ చేసిన నొటిఫికేషన్‌ను కొట్టివేసింది.

అలోక్‌కు తిరిగి సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు అప్పగించాలని.. నిర్ణయాన్ని సెలక్ట్ ప్యానల్‌కు పంపాలని ఆదేశించింది. అలాగే అలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని తెలిపింది.

ఈ వివాదంలో సీవీసీ, ప్రభుత్వ ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం పక్కనబెట్టింది. సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలపై అవినీతి ఆరోపణలతో పాటు ఆధిపత్యపోరు తలెత్తడంతో సీబీఐ పరువు బజారున పడింది.

వెంటనే నష్టనివారణ చర్యలకు దిగిన కేంద్రం గతేడాది అక్టోబర్ 23న రాత్రికి రాత్రి అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాలను సెలవుపై ఇంటికి పంపడంతో పాటు వర్మకు మద్ధుతుగా నిలుస్తున్న 13 మంది ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది.

అలాగే తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావను నియమించింది. అయితే స్వతంత్రంగా వ్యవహరించే సీబీఐని కేంద్రం తన చెప్పు చేతల్లోకి తీసుకుంటోందని కాంగ్రెస్‌తో సహా ప్రధాన ప్రతిపక్షాలు మోడీ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశాయి.

తనను సెలవుపై ఇంటికి పంపడంపై అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం అలోక్, కేంద్రప్రభుత్వం, సీవీసీ వాదనలు విని డిసెంబర్ 6న తీర్పును రిజర్వ్ చేసి.. ఇవాళ తుదితీర్పును వెలువరించింది. 

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా