సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించబడిన అలోక్ వర్మ ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగించబడిన అలోక్ వర్మ ఇంటి వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న నలుగురు యువకులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గురువారం ఉదయం అక్బర్ రోడ్‌లోని అలోక్ వర్మ ఇంటి వెలుపల నలుగురు వ్యక్తులు కారులో కూర్చొని భవంతివైపుగా చూస్తున్నారు.
దీంతో అనుమానం వచ్చిన భద్రతా సిబ్బంది వారిని ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానాలు చెప్పారు. ఈ క్రమంలో ఆ నలుగురిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వీరిని స్టేషన్‌కు తరలించిన పోలీసులు ప్రస్తుతం ప్రశ్నిస్తున్నారు.
అనధికార సమాచారం ప్రకారం పట్టుబడిన నలుగురు ఇంటెలిజెన్స్ బ్యూరోకు చెందిన ఏజెంట్లని వార్తలొస్తున్నాయి. అలోక్ వర్మ కదలికలను నిశితంగా గమనించడం కోసమే ఆయన నివాసం వద్ద వీరు మాటు వేసినట్లుగా ప్రచారం జరగుతోంది.
మరోవైపు సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలు ఒకరిపై మరోకరు అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో పాటు ఆస్థానాపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో అత్యున్నత దర్యాప్తు సంస్థ ప్రతిష్టపై మచ్చ పడింది.
పరువు బజారున పడటంతో కేంద్రప్రభుత్వం రంగంలోకి దిగి వర్మ, ఆస్థానాలను సెలవుపై పంపింది. దీంతో మన్నెం నాగేశ్వరరావును సీబీఐ ఇన్‌ఛార్జ్‌గా నియమిస్తూ ప్రధాని ఆదేశాలు జారీ చేశారు.
అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు
అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ
సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ
రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ
సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు
మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు
