Asianet News TeluguAsianet News Telugu

సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా అలోక్ వర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అలోక్‌ను సెలవుపై పంపడంపై కేంద్రప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన బుధవారం విధులకు హాజరయ్యారు.

CBI Row: Alok Verma back in office as CBI Director
Author
New Delhi, First Published Jan 9, 2019, 12:48 PM IST

కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) డైరెక్టర్‌గా అలోక్ వర్మ మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అలోక్‌ను సెలవుపై పంపడంపై కేంద్రప్రభుత్వాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు ఆయనకు తిరిగి బాధ్యతలు అప్పగించింది. దీంతో ఆయన బుధవారం విధులకు హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు. సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న అలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలపై అవినీతి ఆరోపణలు రావడంతో పాటు, ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకోవడంతో సీబీఐ పరువు బజారున పడింది.

ఈ క్రమంలో నష్టనివారణా చర్యలు చేపట్టిన కేంద్రప్రభుత్వం అలోక్,రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపడంతో పాటు అలోక్ వర్మకు మద్ధతుగా ఉన్న 13 మంది అధికారులను బదిలీ చేసింది. జాయింట్ డైరెక్టర్‌గా ఉన్న మన్నెం నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.

అయితే తనను సెలవుపై పంపడంపై అలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో కేంద్రం గత నెలలో ఇరుపక్షాల వాదనలు విని.. తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న తుది తీర్పును వెలువరించిన న్యాయస్థానం అలోక్ వర్మను సెలవుపై పంపడం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

అయితే వివాదం సద్దుమణిగే వరకు అలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదంటూ ఆదేశించింది. అయితే ఆయన పునర్నియామకంపై తదుపరి నిర్ణయాన్ని సెలక్షన్ కమిటీకి వదిలేసింది. ఈ కమిటీలో సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి, ప్రధానమంత్రి, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత ఉంటారు.

ఈ క్రమంలో జస్టిస్ సిక్రీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజాన్ గొగొయ్ కమిటీ సభ్యుడిగా నామినేట్ చేశారు. ఈ త్రిసభ్య కమిటీలో జస్టిస్ సిక్రీతో పాటు ప్రధాని నరేంద్రమోడీ, ప్రతిపక్షనేత మల్లిఖార్జున ఖర్గే ఉంటారు.

ఈ కమిటీ వారంలోగా సమావేశం కానుంది. మరోవైపు అలోక్ వర్మ పదవి కాలం ఈ నెల 31తో పూర్తి కానుంది. ఆలోగా సుప్రీం తుది నిర్ణయం వెలువడకపోవచ్చునని, కమిటీ సమావేశమై ఆయనకు ఉద్వాసన పలికితే మాత్రం పరిస్థితి వేరుగా ఉంటుందని రాజ్యాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

సీబీఐ వివాదంలో మోడీకి షాక్.. అలోక్‌ను విధుల్లోకి తీసుకోవాలన్న సుప్రీం

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

Follow Us:
Download App:
  • android
  • ios