సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా అవినీతి వ్యవహారం రోజుకోక మలుపు తిరుగుతోంది. కేంద్రప్రభుత్వం, ప్రధాని మోడీ సీబీఐ కార్యకలాపాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నారంటూ ప్రతిపక్షాలు ఎన్డీఏ సర్కార్‌పై ఆరోపణలు చేస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని మోడీకి మరో షాక్ తగిలింది.

రాకేశ్ ఆస్థానా అవినీతి కేసును విచారిస్తున్న బృందంలో ఒకరైన ఏకే బస్సీ తన బదిలీని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆస్థానా నేరం చేశారనడానికి తన వద్ద బలమైన సాక్ష్యాలున్నాయని..  బస్సీ న్యాయస్థానానికి తెలిపారు.

ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేసినట్లుగా ఆస్థానా రూ.3.3 కోట్లు లంచంగా తీసుకున్నారని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి వాట్సాప్ సందేశాలు, ఫోన్ కాల్స్‌ను సాక్ష్యాలుగా సమర్పించారు. సీబీఐలో అలోక్ వర్మ, రాకేశ్ ఆస్థానాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరడం.. కేంద్ర దర్యాప్తు సంస్థ పరువుకి భంగం కలిగేలా కనిపించడంతో ప్రధాని నరేంద్రమోడీ రంగంలోకి దిగి నష్టనివారణా చర్యలు చేపట్టారు.

డైరెక్టర్ అలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాలను సెలవుపై పంపిన కేంద్రం.. మన్నెం నాగేశ్వరరావుకు ఇన్‌ఛార్జ్ డైరెక్టర్‌గా నియమించింది. అలాగే రాకేశ్ ఆస్థానా కేసును విచారిస్తున్న 13 మంది అధికారులపై బదిలీ వేటు వేసింది. ఈ క్రమంలోనే ఏకే బస్సీని పోర్ట్ బ్లేయర్‌కు పంపింది.

సీబీఐలో అంతర్యుద్ధం: సానా సతీశ్‌కు రక్షణ కల్పిస్తాం.. కానీ

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు స్వల్ప ఊరట

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

సీబీఐ అంతర్యుద్ధం : మోడీ చర్యలకు రాజీవ్ చంద్రశేఖర్ ప్రశంసలు

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు