Asianet News TeluguAsianet News Telugu

సీబీఐలో అంతర్యుద్ధం: సానా సతీశ్‌కు రక్షణ కల్పిస్తాం.. కానీ

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసులో కీలకంగా మారిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్ బాబు విచారణ ముగిసే వరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

Supreme Court comments sana satish babu protection petition
Author
Delhi, First Published Oct 30, 2018, 12:09 PM IST

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసులో కీలకంగా మారిన హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త సానా సతీశ్ బాబు విచారణ ముగిసే వరకు తనకు రక్షణ కల్పించాల్సిందిగా అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

దీనిపై ఇవాళ విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో విచారణ నిలుపుదల చేయలేదని స్పష్టం చేసింది.. ఒకవేళ ప్రాణహానీ ఉందనుకుంటే పోలీస్ రక్షణ కల్పిస్తామని సతీశ్‌కు తెలిపింది. అలాగే తనను అరెస్ట్ చేయకుండా ఉత్తర్వులు జారీ చేయాలన్న సతీశ్ అభ్యర్థనను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.

ఢిల్లీకి చెందిన మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషి కేసులో తనను విచారణ నుంచి తప్పించాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన సానా సతీశ్ బాబు.. సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాకు రూ.2 కోట్లు లంచం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. 2017 డిసెంబర్ నాటి ఈ వ్యవహారంలో రాకేశ్ ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దేశంలో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. 

రక్షణ కోసం.. సుప్రీంను ఆశ్రయించిన సానా సతీష్ బాబు

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్తానాకు స్వల్ప ఊరట

సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌కు సుప్రీం షాక్: విధాన నిర్ణయాలొద్దు

హైదరాబాద్‌లో సీబీఐ దాడులు.. ప్రముఖుల ఇళ్లలో సోదాలు

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

Follow Us:
Download App:
  • android
  • ios