ఢిల్లీ: గత కొద్దిరోజులుగా వివాదాలకు కేంద్రబిందువుగా మారుతున్న సీబీఐపై ప్రతిపక్ష పార్టీలు విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా తృణమూల్ అధినేత పశ్చిమ బంగా సీఎం మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా సీబీఐ పేరు మార్చేసి కొత్త పేరు పెట్టారు. సీబీఐ కాదు బీబీఐ అంటూ విమర్శించారు. బీజేపీ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ అంటూ విరుచుకుపడ్డారు. సీబీఐ ఇప్పుడు అతి తెలివి బీబీఐగా మారిపోయిందంటూ ట్వీట్ చేశారు. ఇది చాలా దురదృష్టకరమన్నారు. 

మరోవైపు సీబీఐ కార్యాలయాల వేదికగా చోటు చేసుకుంటున్న కీలక పరిణామాలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ పలు ఆరోపణలు గుప్పించారు. సీబీఐ సంచాలకుడిని సెలవుల మీద ఎందుకు పంపారు? లోక్‌పాల్‌ చట్టం ద్వారా నియమించిన దర్యాప్తు సంస్థ అధికారిపై మోదీ ప్రభుత్వం ఏ చట్టం ప్రకారం చర్యలకు ఆదేశించింది? ఆయన సర్కారు ఏ విషయాన్ని దాచడానికి ప్రయత్నిస్తోంది?’ అంటూ ట్వీట్ చేశారు. 

అలోక్‌ వర్మను పదవి నుంచి తప్పించడానికి రాఫెల్‌ ఒప్పందానికి మధ్య ఏదైనా సంబంధం ఉందా? ఆయన రఫేల్‌ ఒప్పందంపై విచారణ జరిపే యోచనలో ఉన్నారా? మోదీకి ఇబ్బంది కలిగించిన విషయం ఏమిటి?’ అంటూ మరో ట్వీట్ లో విరుచుకుపడ్డారు. 

అటు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సైతం కేంద్రంపై మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చట్ట వ్యతిరేకంగా ఉన్నాయని అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు. 

తమకు అనుకూలంగా వ్యవహరించి, అవినీతికి పాల్పడిన ఓ సీబీఐ అధికారిని రక్షించేందుకే మరో సీబీఐ అధికారిని మోదీ ప్రభుత్వం చట్ట వ్యతిరేకంగా తొలగించిందన్నారు. బీజేపీ అగ్ర నేతలతో ఆయనకు నేరుగా ఉన్న సంబంధాలను కప్పిపుచ్చడానికే ఈ విధంగా తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని ఏచూరి ఆరోపించారు. 

దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా సీబీఐ అధికారుల కార్యాలయాల్లో సోదాలు జరుగుతుండటం ఇదే ప్రథమం కావొచ్చు. సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్‌ ఆస్థానాలను కేంద్రం సెలవులపై పంపింది. అలోక్‌ వర్మ స్థానంలో సీబీఐ డైరెక్టర్ గా మన్నెం నాగేశ్వరరావుకు అప్పగించడం వంటి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. 

ఈ వార్తలు కూడా చదవండి

రేప్ కేసులో తొలిసారి డిఎన్ఎ ఫింగర్ ప్రింటింగ్ వాడింది నాగేశ్వర రావే

సీబీఐ చీఫ్‌గా రెండో తెలుగోడు: ఎవరీ నాగేశ్వరరావు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా

దేశచరిత్రలోనే తొలిసారిగా.. ఢిల్లీలోని సీబీఐ హెడ్‌క్వార్టర్స్‌లో సోదాలు

సీబీఐ కొత్త డైరెక్టర్‌గా తెలుగు ఐపీఎస్

సీబీఐ స్పెషల్ డైరెక్టర్ కు ఊరట:అరెస్ట్ చేయెుద్దన్న ఢిల్లీ హైకోర్టు

సతీష్ సానా ఇష్యూ: సిఎం రమేష్ ఇరుక్కున్నారా, టీడీపికి చిక్కులే...

జగన్ కేసు: అప్పటి నుండే సీబీఐ దర్యాప్తులో సతీష్ సానా పేరు

సీబీఐలో అంతర్యుద్దం: ఎవరీ సతీష్‌బాబు