కేవలం ఒక వ్యక్తి చేసిన ఆరోపణలతోనే తనను పదవి నుంచి తొలగించారన్నారు సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ. కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌గా అలోక్ వర్మ పునర్నియామకంపై ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ గురువారం రాత్రి సమావేశమైంది.

అవినీతి ఆరోపణలు, విధుల పట్ల నిర్లక్ష్యం వంటి ఆరోపణలు ఉన్నట్లు కేంద్ర నిఘా కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా అలోక్ వర్మపై బదిలీ చేయాలని నిర్ణయించింది. వెంటనే సీబీఐ డీజీగా ఆయనను తొలగించి, అగ్నిమాపక, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్స్ విభాగం డీజీగా బదిలీ చేసింది. కొత్త డైరెక్టర్ నియామకం జరిగే వరకు లేదంటే తుది ఉత్తర్వులు వెలువడే వరకు నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించింది.

ఈ విషయంపై అలోక్ వర్మ మాట్లాడుతూ..అవినీతి కేసులపై దర్యాప్తు జరిపే సీబీఐ స్వతంత్రతను తప్పనిసరిగా కాపాడాలని కోరారు. తాను సంస్థ సమగ్రతను కాపాడేందుకు ప్రయత్నించానని తెలిపారు. కానీ న్యాయపరమైన సమ్మతి లేకుండా అక్టోబర్ 23న కేంద్రం, సీవీసీ తనపై ఆదేశాలు జారీ చేశాయని పేర్కొన్నారు. నిరాధారమైన ఆరోపణలతో తనను ఎంపిక కమిటీ బదిలీ చేయడం విచారకరమన్నారు.

సీబీఐ డైరెక్టర్‌ అలోక్ వర్మ‌ను తొలగించిన హైపవర్ కమిటీ

అలోక్‌వర్మ దెబ్బ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారుల బదిలీ

రాఫెల్‌పై విచారణ చేస్తున్నందుకే సీబీఐ డైరెక్టర్‌ తోలగింపు: రాహుల్

సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ ఇంటి వద్ద కలకలం.. ఆ నలుగురు ఎవరు..?

అంతర్యుద్ధం: రాత్రికి రాత్రి 15 మంది బదిలీ, కొత్త సిట్ ఏర్పాటు

అలోక్ వర్మ Vs రాకేష్ ఆస్థానా: వర్మ సహకరించలేదు: సీవీసీ

సీబీఐ చీఫ్ ను తప్పించింది అందుకే..:రాహుల్ గాంధీ

రాకేష్ Vs అలోక్‌వర్మ: అందుకే సెలవుపై పంపాం: జైట్లీ

సీబీఐలో అలోక్ Vs ఆస్థానా: ఒకనాటి కథ కాదు

మోడీ భయపెట్టే స్థితి తెచ్చారు: సీబీఐలో అంతర్యుద్దంపై విపక్షాలు

2ఎఎం ఆర్డర్, హైడ్రామా: సిబిఐ చీఫ్, ఆయన డిప్యూటీలపై కొరడా