న్యూఢిల్లీ: సీబీఐలో ఐదుగురు ఉన్నతాధికారులు గురువారం నాడు బదిలీ అయ్యారు. సీబీఐ  డైరెక్టర్ గా  అలోక్ వర్మ నియమితులైన మరునాడే ఐదుగురు ఉన్నతాధికారులు బదిలీ కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

సీబీఐ జాయింట్ డైరెక్టర్  అజయ్ భట్నాగర్, డీఐజీ ఎంకె సిన్హా,  డీఐజీ తరుణ్ గౌభా, జాయింట్ డైరెక్టర్ మురుగేషన్, అసిస్టెంట్ డైరెక్టర్ ఎకె శర్మలను బదిలీ చేస్తూ అలోల్ వర్మ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు ఈ ఐదుగురు అధికారుల బదిలీల ఆర్డర్లపై ఆలోక్ వర్మ సంతకాలు కూడ చేశారు.

అనీష్ ప్రసాద్  డిప్యూటీ డైరెక్టర్ గా కొనసాగుతారు. 77 రోజుల విరామం తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అలోక్ వర్మ సీబీఐ డైరెక్టర్‌గా బుధవారం నాడు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.