Asianet News TeluguAsianet News Telugu

అయ్యప్ప ఆలయంలోకి ముస్లిం మహిళ... మతం నుంచి బహిష్కరణ

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టేందుకు మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హేతువాదులు కూడా సదరు మహిళలను ప్రొత్సహించేందుకు నడుం బిగించారు. 

kerala muslim community expelled social activist rehana
Author
Sabarimala, First Published Oct 21, 2018, 3:51 PM IST

శబరిమల అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టేందుకు మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో హేతువాదులు కూడా సదరు మహిళలను ప్రొత్సహించేందుకు నడుం బిగించారు.

ఈ క్రమంలో అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను మత పెద్దలు ముస్లిం సమాజం నుంచి బహిష్కరణ వేటుకు గురయ్యారు. సుప్రీం తీర్పును అనుసరించి.. గట్టి బందోబస్తు మధ్య శబరిమల ఆలయంలోకి ప్రవేశించేందుకు ఇరుముడితో రెహానా కొండపైకి చేరుకున్నారు.

మహిళలు ఆలయంలోకి ప్రవేశిస్తే గుడిని మూసివేస్తామని ప్రధానార్చకుడు హెచ్చరించడంతో ఆమె ఉద్రిక్త పరిస్థితుల మధ్య వెనక్కి వచ్చేశారు. వీరి ప్రవేశం అల్లర్లకు దారి తీసింది.. అటు ఫాతిమా చర్యపై కేరళ ముస్లిం జమాత్ కౌన్సిల్ తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేసింది.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా.. వారి సాంప్రదాయాలకు భంగం కలిగేలా వ్యవహరించిన రెహానాతో పాటు వారి కుటుంబం మొత్తాన్ని ముస్లిం సమాజం నుంచి బహిష్కరించింది. ఈ మేరకు ఎర్నాకులం కౌన్సిల్‌ను ఆదేశించింది.

అంతకు ముందు రెహానా కొండపైకి అడుగుపెట్టిన సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఇంటిపై రాళ్లదాడికి పాల్పడ్డారు. సామాజిక కార్యకర్త వ్యవహరిస్తున్న ఫాతిమా గతంలో ఎన్నో వివాదాస్పద కార్యక్రమాలు నిర్వహించారు. ముస్లిం సాంప్రదాయానికి వ్యతిరేకంగా కిస్ ఆఫ్ లవ్‌లో పాల్గొన్నందుకు గాను జమాత్ కౌన్సిల్ నుంచి నోటీసులు సైతం అందుకున్నారు.

శబరిమల వివాదంపై మొదటిసారి స్పందించిన రజినీకాంత్!

శబరిమల: సుప్రీం తీర్పుపై అఫిడవిట్‌కు ట్రావెన్ కోర్ బోర్డు నిర్ణయం

భద్రతను దాటి అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించిన మహిళ..?

శబరిమల ప్రవేశం: మహిళల పట్ల వివక్ష అనడం దురదృష్టకరం..ప్రమాదం

అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే వెను దిరిగిన మహిళలు, ఎందుకంటే?

శబరిమల వద్ద ఇంకా ఉద్రిక్తత: గుడికి 200 మీటర్ల దూరంలో మహిళలు

శబరిమలలో ఉద్రిక్తతే: న్యూయార్క్ టైమ్స్ లేడీ జర్నలిస్టుపై దాడి

శబరిమల ఆలయం వద్ద ఉద్రిక్తత: తెరుచుకున్న తలుపులు

శబరిమల వద్ద ఉద్రిక్తత: ఆలయంలోకి వెళ్లే మహిళలపై రాళ్ల దాడి, లాఠీచార్జీ

శబరిమల దాకా వెళ్లి వెనక్కి మళ్లిన ఏపీ మహిళ
 

Follow Us:
Download App:
  • android
  • ios