Asianet News TeluguAsianet News Telugu

దారుణం.. మైనర్ స్నేహితురాలిని గ్యాంగ్ రేప్ చేయించిన యువతి.. ముంబైలో ఘ‌ట‌న‌

తన స్నేహితురాలే కదా అని నమ్మి వెంట వెళ్లిన ఓ మైనర్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆ స్నేహితురాలు మైనర్ ను గ్యాంగ్ రేప్ చేయించింది. ఈ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

Atrocious.. Young girl who gang-raped a minor friend.. Happened in Mumbai
Author
First Published Aug 19, 2022, 12:46 PM IST

ముంబైలో దారుణం జ‌రిగింది. ఓ యువ‌తి త‌న మైనర్ స్నేహితురాలిని సామూహిక అత్యాచారం చేసేలా యువకులను ప్రేరేపించింది. దీంతో ఆమె చూస్తుండగానే ఇద్ద‌రు ఆమెను రేప్ చేశారు. ఈ ఘ‌ట‌న వెలుగులోకి రావ‌డంతో దీంట్లో ప్ర‌మేయం ఉన్న ముగ్గురు నిందితుల‌ను, ఆ మ‌హిళా స్నేహితురాలిని పోలీసులు అరెస్టు చేశారు. 

ఆ దోషులు బ్రాహ్మ‌ణులు, సంస్కారులు అంటూ బీజేపీ నేత‌ల వ్యాఖ్య‌లు.. అస‌దుద్దీన్ ఒవైసీ ఫైర్

దీనికి సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. 11 ఏళ్ల బాధితురాలు ఆగస్ట్ 16వ తేదీన (మంగళవారం) సాయంత్రం 7 గంటల సమయంలో తన సెల్‌ఫోన్ రిపేర్ చేయడానికి తన ఇంటికి సమీపంలోని షాప్ కు వెళ్లింది. అయితే ఆమె ఆ స‌మ‌యంలో 21 ఏళ్ల మహిళా స్నేహితురాలిని క‌లుసుకుంది. దీంతో ఆమె ఆ మైన‌ర్ ను షికారుకు తీసుకెళ్లింది. బాలిక‌తో క‌లిసి ఓ ఏకాంత ప్ర‌దేశానికి చేరుకుంది. ఈ స‌మ‌యంలో యువ‌తి త‌న ముగ్గురు యువ‌కుల‌ను అక్క‌డికి పిలిచింది. అర్ధరాత్రి దాటాక నిందితులు ఘటనా స్థలానికి  చేరుకున్నారు. ఇందులో ఒక‌రి వ‌య‌స్సు 21 సంవ‌త్స‌రాలు. అనంత‌రం బాలికను రాబోయే గణేష్ ఉత్సవాల కోసం ఏర్పాటు చేసిన పండల్ వెనుక ఉన్న ప్రదేశానికి తీసుకెళ్లి బందించారు.

Bilkis Bano Case : వారు బ్రాహ్మణులు, మంచి సంస్కారం ఉన్నవారు.. దోషుల విడుదలపై బీజేపీ నేత సికె రౌల్జీ

ఈ స‌మ‌యంలో ఆ యువ‌కుల‌తో ఒక‌రితో లైంగిక సంబంధం పెట్టుకోవాల‌ని యువ‌తి బాలిక‌ను బెదిరించింది. మైన‌ర్ పై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో 21 ఏళ్ల యువ‌కుడు, మ‌రో వ్య‌క్తి వంతులవారీగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం అంతా యువ‌తి క‌ళ్ల ఎదుటే జ‌రిగింది. అనంత‌రం బాధితురాలిని వీరంతా క‌లిసి బుధ‌వారం తెల్ల‌వారుజామున ఇంటి దగ్గర పడేసి వెళ్లిపోయారు.

బాధితురాలు ఇంట్లోకి చేరుకొని త‌న‌పై జ‌రిగిన అఘాయిత్యాన్ని కుటుంబ స‌భ్యుల‌కు వివ‌రించింది. దీంతో ఆమె తల్లి విరార్ పోలీసులను ఆశ్రయించింది, వారు నిందితుల‌ను ప‌ట్టుకోవ‌డానికి బృందాలను ఏర్పాటు చేశారు. బాధితురాలి స్నేహితురాలిని ప‌ట్టుకొని నిందితులు ఎవ‌ర‌నే స‌మాచారాన్ని సేక‌రించారు. నిందితుల్లో ఒకరు కళాశాల విద్యార్థి కాగా, మరొకరు కూరగాయల వ్యాపారి వీరు ఇద్దరూ విరార్ ప్రాంతంలో నివాసం ఉంటారు. వారిని మూడు గంట‌ల్లోనే పోలీసులు అరెస్టు చేశారు.

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చిన‌ట్టే మార్చారు - నితీష్ కుమార్ పై కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యలు

డ్రగ్స్ డీలర్‌గా భావించి వివిధ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదైన మూడో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై ఐపీసీ సెక్షన్ల కింద సామూహిక అత్యాచారం, అసహజ సెక్స్, పోక్సో సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. వారిని పోలీసు కస్టడీకి తరలించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios