Asianet News TeluguAsianet News Telugu

Bilkis Bano Case : వారు బ్రాహ్మణులు, మంచి సంస్కారం ఉన్నవారు.. దోషుల విడుదలపై బీజేపీ నేత సికె రౌల్జీ

బిల్కిస్ బానో కేసులో విడుదలైన 11మంది మంచి సంస్కారం ఉన్న బ్రాహ్మణులని బిజెపి నాయకుడు సికె రౌల్జీ అన్నారు. రేపిస్టులను విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన గుజరాత్ ప్రభుత్వ ప్యానెల్‌లో సికె రౌల్జీ ఒకరు.

BJP MLA CK Raulji comments goes viral on  Bilkis Bano's Rapists
Author
hyderabad, First Published Aug 19, 2022, 12:03 PM IST

న్యూఢిల్లీ : బిల్కిస్ బానోపై అత్యాచారం కేసులో దోషులుగా తేలి గుజరాత్ ప్రభుత్వం 15 ఏళ్ల జైలు శిక్ష తర్వాత విడుదల చేసిన 11 మంది ‘బ్రాహ్మణులు’ అని, వారికి ‘మంచి సంస్కారం’ ఉందని గోద్రాలోని బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నారు. వీరి విడుదలపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, విడుదలైన వారికి స్వీట్లు పంచి, దండలతో సత్కరించిన వారికి CK Raulji రౌల్జీ మద్దతు ఇచ్చారు.

రేపిస్టులను విడుదల చేయాలని ఏకగ్రీవంగా నిర్ణయించిన గుజరాత్ ప్రభుత్వ ప్యానెల్‌లో భాగమైన ఇద్దరు బిజెపి నాయకులలో సికె రౌల్జీ ఒకరు. దోషులలో ఒకరు ఉపశమనం కోరుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీనిమీద నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.

"వారు నేరం చేశారో లేదో నాకు తెలియదు. కానీ నేరం చేయాలనే ఉద్దేశ్యం ఉండి ఉంటుంది" అని సికె రౌల్జీ మీడియా ప్రతినిధులతో అన్నారు. "వారు బ్రాహ్మణులు. బ్రాహ్మణులు మంచి సంస్కారం కలిగి ఉంటారు. వారిని కార్నర్ చేసి శిక్షించాలనేది ఎవరైనా దురుద్దేశం కావచ్చు" అని తనను ఇంటర్వ్యూ చేసిన రిపోర్టర్ తో ఎమ్మెల్యే అన్నారు. ఇప్పుడిది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఖైదీలు జైలులో ఉన్నప్పుడు మంచి ప్రవర్తన కలిగి ఉన్నారని ఆయన తెలిపారు.

Bilkis Bano Case : నేరస్తుల విడుదల వార్త విని నమ్మలేకపోయా.. షాక్ అయ్యా.. స్మితా సబర్వాల్

స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఎర్రకోటపై నుంచి మహిళా సాధికారత గురించి ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడిన కొన్ని గంటల తర్వాత రేపిస్టులు స్వేచ్ఛగా విడుదల చేయబడ్డారు. కొద్దిసేపటి తర్వాత, ఒక మితవాద సమూహం వారికి సాదర స్వాగతం పలికిన వీడియోలు వెలువడ్డాయి. విమర్శలు వెల్లువెత్తడంతో, గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది, 1992 పాలసీ ప్రకారం, సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రకారం, 2008లో దోషిగా నిర్ధారించబడిన సమయంలో అమలులో ఉన్నందున విడుదల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్నట్లు పేర్కొంది.

అత్యాచారం, హత్యల దోషులకు ఉపశమనాన్ని నిరోధించే ప్రస్తుత నిబంధనలకు విరుద్ధంగా చేసిన ఈ చర్య చాలా మందిని విస్మయానికి గురి చేసింది. దీనిపై విపక్షాలు గళం విప్పాయి. తెలంగాణ అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సోషల్ మీడియా కన్వీనర్ వై సతీష్ రెడ్డి ఈ వీడియోను ట్వీట్ చేశారు. "వారు బ్రాహ్మణులు, మంచి సంస్కార పురుషులు. జైలులో వారి ప్రవర్తన బాగుంది" : BJP MLA #CKRaulji రేపిస్టులను బిజెపి ఇప్పుడు 'మేన్ ఆఫ్ గుడ్ సంస్కార్' అని పేర్కొంది. ఒక పార్టీ దిగజారిపోలేని అత్యల్ప పరిస్థితి ఇదే!’’ అని ఆయన ట్వీట్ చేశారు.

అంతకుముందు, కాంగ్రెస్‌కు నేత రాహుల్ గాంధీ ఈ విడుదల మహిళల పట్ల బిజెపి ఆలోచనను ప్రదర్శిస్తుందని ట్వీట్ చేశారు.
"ఉన్నావ్ - బిజెపి ఎమ్మెల్యేను రక్షించడానికి పనిచేసింది. కతువా - రేపిస్టులకు అనుకూలంగా ర్యాలీ. హత్రాస్ - రేపిస్టులకు అనుకూలంగా ప్రభుత్వం. గుజరాత్ - రేపిస్టుల విడుదల, గౌరవం. నేరస్థులకు మద్దతు ఇవ్వడం మహిళల పట్ల బిజెపి కుంచిత మనస్తత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఇలాంటి రాజకీయాలకు మీరు సిగ్గుపడరు, ప్రధాని జీ’’ అని ఆయన ట్వీట్ చేశారు.

తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన మహువా మోయిత్రా "బిల్కిస్ బానో మహిళనా లేదా ముస్లిమా అని దేశం నిర్ణయించుకోవడం మంచిది" అని ట్వీట్ చేశారు. సీకే రౌల్జీ, సుమన్ చౌహాన్‌లతో పాటు, "గోద్రా రైలు దహనం కేసులో ప్రాసిక్యూషన్‌కు కీలక సాక్షిగా ఉన్న మరో సభ్యుడు (రిమిషన్ అప్పీల్‌ను సమీక్షించే ప్యానెల్‌లో) మురళీ ముల్చందానీ అని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం ట్వీట్ చేశారు!

2002 గుజరాత్ అల్లర్ల సమయంలో ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినప్పుడు బిల్కిస్ బానో వయస్సు 21 సంవత్సరాలు. ఐదు నెలల గర్భిణి. ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యులు హత్య చేయబడ్డారు, వారిలో ఆమె మూడేళ్ల కుమార్తెను రాళ్లతోకొట్టి చంపారు. ఆమె చెప్పిన మరో ఏడుగురు బంధువులు కూడా "తప్పిపోయినట్లు" ప్రకటించారు.
రేపిస్టులకు జైలుశిక్ష పడే వరకు ఆమె చాలా సంవత్సరాలు అజ్ఞాతంలో గడిపింది. విడుదలైన తర్వాత, ఆమె చాలా షాక్‌కు గురైంది. గుజరాత్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, నా కుటుంబం, నేను సురక్షితంగా ఉండేలా చూడాలని" ఆమె కోరారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios