Asianet News TeluguAsianet News Telugu

అమ్మాయిలు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చిన‌ట్టే మార్చారు - నితీష్ కుమార్ పై కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యలు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై బీజేపీ నేత కైలాస్ విజయవర్గియా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సీఎం ను ఆయన బాయ్ ఫ్రెండ్స్ ను మార్చే అమ్మాయిలతో పోల్చారు. 
 

BJP leader Kailash Vijayvargiya's comments on Nitish Kumar: "Girls changed their boyfriends".
Author
First Published Aug 19, 2022, 10:56 AM IST

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గీయ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎప్పుడంటే అప్పుడు బాయ్ ఫ్రెండ్స్ ను మార్చుకునే విదేశీ అమ్మాయిలో పోల్చారు. బీజేపీతో ఉన్న పొత్తును రద్దు చేసుకుని, మహాఘటబంధన్‌తో చేతులు కలిపారని విమ‌ర్శించారు. ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. 

ప్రేయసి కోసం బుర్కా వేసుకున్న ప్రియుడు... కట్ చేస్తే..అతడికి జరిగింది తెలిస్తే షాక్...

‘‘ నేను కొన్ని రోజులు విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు .. ఇక్క‌డ ఉన్న అమ్మాయిలు ఎప్పుడంటే అప్పుడు త‌మ బాయ్ ఫ్రెండ్స్ ల‌ను మార్చుకుంటార‌ని నాకు ఒక‌రు చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా అంతే. అత‌డు ఎవరి చేయి పట్టుకుంటాడో, ఎవ‌రి చేయి విడిచిపెడ‌తాడో మాకు తెలియ‌దు.” అని కైలాష్ విజయవర్గియా అన్నారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ చీఫ్ రణ్‌దీప్ సూర్జేవాలా స్పందించారు. విజ‌య‌వ‌ర్గియా మాట్లాడిన వీడియోను ట్విట్ట‌ర్ లో షేర్ చేశారు. “ బీజేపీ జనరల్ సెక్రటరీ మహిళల పట్ల చూపించే గౌర‌వానికి ఇది ఒక ఉదాహర‌ణ‌” అని అన్నారు.

ఒడిశాలో వరదలు.. మ‌రో రెండు రోజులు కుండ‌పోత వ‌ర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు

కాగా.. ఇటీవల బీహార్ మాజీ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ కూడా నితీష్ కుమార్ పై వ్యాఖ్యలు చేశారు. లాలూ ప్రసాద్ యాదవ్ అనారోగ్యాన్ని ఉపయోగించుకుని రాష్ట్రీయ జనతాదళ్‌ను నితీస్ కుమార్ చీలుస్తార‌ని అన్నారు. త‌రువాత ఆ పార్టీని కూడా వ‌దిలేస్తార‌ని ఆరోపించారు.‘‘ నితీష్ ఆర్జేడీని వదిలేస్తారు. (అతను) లాలూ అనారోగ్యాన్ని ఉపయోగించుకుని దానిని విభజించడానికి ప్రయత్నిస్తారు ’’ అని అన్నారు. “ జేడీ(యూ)ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు అంటున్నారు. దీనికి శివసేనను ఉద‌హార‌ణ‌గా చెబుతున్నారు. శివసేన మా మిత్రపక్షం కాదు. అక్కడ అధికార పార్టీగా ఉంది. మీరు (జేడీ-యూ) మా మిత్రపక్షం. మేము మా మిత్రపక్షాలను ఎన్నడూ విచ్ఛిన్నం చేయలేదు” అని ఆయ‌న నొక్కి చెప్పారు.

బీహార్ లో రాజకీయాల కొంత కాలం కిందట ఒక్క సారిగా మారిపోయాయి. ప్ర‌స్తుత సీఎం నితీష్ కుమార్ త‌న పార్టీ అయిన జేడీ(యూ), బీజేపీ ఆధ్వ‌ర్యంలోని ఎన్డీఏతో క‌లిసి 2020 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేశాయి. ఈ కూట‌మికి మెజారిటీ రావడంతో రాష్ట్రంలో ఎన్డీఏ ప్ర‌భుత్వం కొలువుదీరింది. అయితే ఇటీవ‌ల బీజేపీకి, జేడీ(యూ)కి మ‌ధ్య‌న విభేదాలు వ‌చ్చాయి. దీంతో నితీష్ కుమార్ ఎన్డీఏ కూట‌మి నుంచి వైదొలిగారు. ఆర్జేడీతో, కాంగ్రెస్, అలాగే ఇత‌ర చిన్న పార్టీలో కూడిన మ‌హాఘ‌ట్ బంధ‌న్ తో చేతులు క‌లిపారు. మ‌ళ్లీ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. ఆర్జేడీ నాయ‌కుడు తేజస్వీ యాద‌వ్ డిప్యూటీ సీఎం అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios