Asianet News TeluguAsianet News Telugu

రెండేళ్లుగా యువతిపై గ్యాంగ్ రేప్.. సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి అఘాయిత్యం.. !

రాజస్థాన్ అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఒక యువతి (20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీని మీద మొదట ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణం కొనసాగిందని బాధితురాలు వాపోయింది. 

Alwar girl gangraped since 2019 after cops refuse to register FIR - bsb
Author
Hyderabad, First Published Jul 2, 2021, 1:15 PM IST

రాజస్థాన్ అల్వార్ జిల్లాలో చోటు చేసుకున్న అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత రెండేళ్లుగా ఒక యువతి (20)పై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. దీని మీద మొదట ఫిర్యాదు చేసినప్పటికీ పోలీసులు పట్టించుకోకపోవడంతోనే ఈ దారుణం కొనసాగిందని బాధితురాలు వాపోయింది. 

ఈ సంఘటన వివరాల్లోకి వెడితే.. తనను కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారంటూ ముగ్గురిమీద 2019 ఏప్రిల్ లో అల్వార్ లోని మలఖేరా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అయితే నిందితులపై ఎలాంటి కేసు నమోదు కాకపోవడంతో మే నెలలో మరోసారి పోలీస్ స్టేషన్ ను సంప్రదించింది. 

అయినా పోలీసులు పట్టించుకోలేదు. కేసూ లేదు, విచారణ లేదు.. కనీసం చర్యలు అసలే లేవు. దీన్ని అలుసుగా తీసుకున్న దుండగులు మరింత రెచ్చిపోయారు. అత్యాచార వీడియో సోషల్ మీడియాలో పెడతానని బెదిరించి మరీ గత రెండేళ్లుగా తమ అరాచకాన్ని పలుమార్లు కొనసాగిస్తూ వచ్చారు. 

అక్కడితో వాళ్ల ఆగడాలకు చెక్ పడలేదు. రేప్ వీడియోను ఈ ఏడాది జూన్ 25న బాధితురాలికి పంపించాడు. నిందుతుల్లో ఒకడైన గౌతం సైనీ, తనతో గడిపాలని, లేదంటే ఆ వీడియోను ఆమె కుటుంబ సభ్యులతో పాటు, సోషల్ మీడియాలో షేర్ చేస్తానంటూ బెదిరించాడు. 

అయితే దీన్ని ఆమె పట్టించుకోకపోవడంతో రెండు రోజుల తరువాత సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో విసిగిపోయిన బాధితురాలు జిల్లా ఎస్ పీ తేజస్విని గౌతమ్ ను కలిసి వేడుకోవడంతో చివరికి మహిళా పోలీస్ స్టేషన్ లో జూన్ 28న ఫిర్యాదు నమోదైంది. అప్పటికే ఈ వీడియో వైరల్ గావడంతో పోలీసులు స్పందించక తప్పలేదు. 

వికాస్, భ్రూ జాట్, గౌతం సైనీ అనే ముగ్గురు నిందిుతలను గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు అనంతరం చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు వెల్లడించారు. అలాగే మొదటి ఫిర్యాదుపై నిర్లక్షం వహించారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios