Asianet News TeluguAsianet News Telugu

పోలీస్ ఆఫీసర్ ను అంటూ 13 ఏళ్ల బాలికను పార్కుకు తీసుకెళ్లి లైంగికదాడి.. క్రిస్మస్ వేడుకల అనంతరం ఘటన

ఢిల్లీలో ఓ మైనర్ పై దారుణం జరిగింది. క్రిస్మస్ వేడుకలు పూర్తి చేసుకొని వస్తున్న బాలికను ఓ వ్యక్తి పార్క్ కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

A 13-year-old girl was taken to the park and sexually assaulted by calling her a police officer. Incident after Christmas celebrations
Author
First Published Dec 28, 2022, 10:06 AM IST

క్రిస్మస్ వేడుకల నుంచి రాత్రి సమయంలో ఇంటికి తిరిగి వెళ్తున్న ఓ మైనర్ బాలికను 50 ఏళ్ల వ్యక్తి ఆపాడు. తాను పోలీసు ఆఫీసర్ ను అంటూ పరిచయం చేసుకున్నాడు. ఓ పార్కుకు తీసుకెళ్లి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

జ‌మ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... డిసెంబర్ 25వ తేదీన పశ్చిమ ఢిల్లీలోని సాగర్పూర్ ప్రాంతంలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించేందుకు 13 ఏళ్ల బాలిక తన స్నేహితులతో కలిసి వెళ్లింది. వేడుకల అనంతరం రాత్రి 8 గంటలకు స్నేహితులతో కలిసి తను నివాసం ఉండే ప్రాంతానికి తిరిగి వెళ్తోంది.

జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు

ఈ సమయంలో వారందరినీ ఓ 50 ఏళ్ల వ్యక్తి అడ్డగించాడు. తాను పోలీసు అధికారిని అని, ఈ సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నారని వారిని ప్రశ్నించారు. దీంతో వారు సమాధానం చెప్పారు. పిల్లలందరికీ మాయమాటలు చెప్పి సమీపంలో ఉన్న పార్కుకు తీసుకెళ్లాడు. తరువాత బాధిత బాలికను అక్కడే ఉంచుకొని మిగితా పిల్లలను పక్కకు పంపించాడు. అనంతరం ఆమెను మారుమూల ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు.

అర్దరాత్రి ఇంట్లో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి..

ఈ దుశ్చర్యకు పాల్పడిన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని చికిత్స కోసం హాస్పిటల్ కు తరలించారని వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. భారతీయ శిక్షాస్మృతి, పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

షుగర్ వ్యాధితో బాధపడుతున్న 7, 3 యేళ్ల చిన్నారులు.. తట్టుకోలేక ఆ కుటుంబం చేసిన పని...

ఈ దర్యాప్తు సమయంలో పోలీసు బృందాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీని సేకరించాయి. దాని ఆధారంగా నిందితుడిని పట్టుకున్నాయి. ఈ కేసులో విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios