Asianet News TeluguAsianet News Telugu

జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు

జమ్మూలోని సిధ్రా బుధవారం ఉదయం ఎన్ కౌంటర్ ప్రారంభమైంది. భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నట్టు సమాచారం. 

Ongoing encounter in Jammu's Sidhra area.. Two terrorists trapped
Author
First Published Dec 28, 2022, 8:37 AM IST

జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో బుధవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు చిక్కుకున్నారని అధికారులు తెలిపారు. ఇంకా కాల్పులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. 

ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉండగా.. జమ్మూలోని ఉధంపూర్ జిల్లాలో డిసెంబర్ 26వ తేదీన స్వాధీనం చేసుకున్న 15 కిలోల ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ)ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు మంగళవారం నిర్వీర్యం చేశారు.  ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్‌లోని ఖండారా అడవుల్లో సోమవారం నాడు సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో ఐఈడీ, 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, 7.62 మిల్లీమీటర్ల ఏడు కాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్లతో పాటు నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీకి చెందిన లెటర్ ప్యాడ్ పేజీని స్వాధీనం చేసుకున్నారు. ఆ స్వాధీనం చేసుకున్న ఐఈడీని మంగళవారం సురక్షితంగా నిర్వీర్యం చేసినట్లు అధికారులు తెలిపారు.  ఈ క్రమంలో ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారి తెలిపారు. అలాగే బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నారు. దీంతో తీవ్రవాద కుట్రను భారీ కుట్ర భగ్నం అయినట్టు పోలీసులు భావిస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios