Asianet News TeluguAsianet News Telugu

జ‌మ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్ర‌వాదులు హ‌తం

Srinagar: జమ్మూ కాశ్మీర్‌లోని సిధ్రాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉన్నారని జేకే ఏడీజీపీ తెలిపారు.
 

Encounter in Jammu and Kashmir.. Three terrorists killed
Author
First Published Dec 28, 2022, 9:51 AM IST

Jammu Kashmir Encounter: భద్రతా బలగాలకు-ఉగ్ర‌వాదుల‌కు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉన్నారని జేకే ఏడీజీపీ తెలిపారు. వివ‌రాల్లోకెళ్తే.. జమ్మూలోని పంజ్‌తీర్థి-సిధ్ర రహదారిపై ఉదయం 7.30 గంటలకు ఉగ్ర‌వాదుల సంచారం గుర్తించిన భ‌ద్ర‌తా బ‌ల‌గాలు.. వారు అక్క‌డ చెలరేగడంతో అదనపు బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే ఇరువురి మ‌ధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.  గ్రెనేడ్ పేలుడు జరగడంతో ఎదురుకాల్పులు జరిగాయి. 

ఎదురుకాల్పులు జరిగినప్పుడు ఉగ్రవాదులు ట్రక్కులో ఉన్నారని జేకే ఏడీజీపీ తెలిపారు. ట్రక్కు డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడని అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ముఖేష్ సింగ్ తెలిపారు. "మేము ఒక ట్రక్కు అసాధారణ కదలికను గమనించాము. ఈ క్ర‌మంలోనే దానిని అనుసరించాము. జమ్మూలోని సిధ్రా వద్ద ట్రక్కును ఆపారు.. అయితే, అక్కడ డ్రైవర్ పారిపోయాడు. ట్రక్కులో దాక్కున్న ఉగ్రవాదులు తనిఖీ చేయగా సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ క్ర‌మంలోనే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు సైతం ఎదురుకాల్పులు జ‌రిపారు” అని సింగ్ చెప్పారు. ముగ్గురు ఉగ్రవాదులు ఇప్పుడు హతమయ్యారు.. ఎన్‌కౌంటర్ స్థలం నుండి ఒక ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఐదు నుండి ఆరు గ్రెనేడ్ పెలుళ్లు చోటుచేసుకున్నాయ‌ని చెప్పారు. ఈ పేలుళ్ల శబ్దాలకు మేల్కొన్న నివాసితులు ఎన్‌కౌంటర్‌ను మొదట నివేదించార‌నీ, తరువాత భారీ కాల్పులు జరిగాయ‌ని చెప్పిన‌ట్టు మీడియా క‌థ‌నాలు పేర్కొంటున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న 15 కిలోల బరువున్న ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని (IED) పోలీసులు సోమవారం నిర్వీర్యం చేసిన తర్వాత ఈ ఎన్‌కౌంటర్ జరిగింది. దీంతో ఒక పెద్ద ఉగ్రవాద ప్రణాళికను నివారించిన‌ట్టు అంత‌కుముందు అధికారులు తెలిపారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)కి చెందిన ఒక కోడెడ్ షీట్, ఒక లెటర్ ప్యాడ్ పేజీని కూడా స్వాధీనం చేసుకున్నామని, ఒక అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

 

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బసంత్‌గఢ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

"స్థూపాకార ఆకారంలో 15 కిలోల బరువున్న ఐఈడీ లాంటి పదార్థం, 300-400 గ్రాముల ఆర్‌డీఎక్స్, 7.6 మిల్లీమీటర్ల ఏడు కాట్రిడ్జ్‌లు, ఐదు డిటోనేటర్లు, ఒక కోడెడ్ షీట్, ఉధంపూర్ జిల్లా బసంత్‌గఢ్ ప్రాంతంలో నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్ఈటీ లెటర్ ప్యాడ్ పేజీ, ఒక నిందితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ఒక ప్రకటనలో" తెలిపారు. కాగా, నవంబర్‌లో, జమ్మూ కాశ్మీర్ పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్‌లో ఒక AK-47 రైఫిల్, ఒక AK-56 రైఫిల్, నాలుగు AK సిరీస్ మ్యాగజైన్‌లు, లైవ్ రౌండ్లు, RDX పౌడర్, నెయిల్స్ & బాల్ బేరింగ్‌లు, 9 వోల్ట్ బ్యాటరీలు, డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. IED మెకానిజం సర్క్యూట్, రిమోట్ కంట్రోల్, లూజ్ వైర్, ఇనుప పైపులు కూడా స్వాధీనం చేసుకున్నారు. జమ్మూ కాశ్మీర్‌లోని బందిపొర వద్ద ఇద్దరు యాక్టివ్ LeT టెర్రరిస్టులు, ఇద్దరు సహచరులను అరెస్టు చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios