MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • స్టేజ్‌పై అందరి ముందే పాట రూపంలో ప్రేమని వ్యక్తం చేసిన ఐశ్వర్యరాయ్‌.. సల్మాన్‌ ఖాన్‌ కి బెస్ట్ మూమెంట్‌..

స్టేజ్‌పై అందరి ముందే పాట రూపంలో ప్రేమని వ్యక్తం చేసిన ఐశ్వర్యరాయ్‌.. సల్మాన్‌ ఖాన్‌ కి బెస్ట్ మూమెంట్‌..

కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ ఘాటు ప్రేమలో మునిగితేలారు. వీరికి సంబంధించిన అరుదైన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.  

3 Min read
Author : Aithagoni Raju
Published : Apr 30 2024, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

 సల్మాన్‌ ఖాన్‌ డేటింగ్‌ చేసిన హీరోయిన్ల జాబితా చాలా పెద్దదే. ఆరేడు మంది హీరోయిన్లతో ఆయన లవ్‌ ట్రాక్‌ నడిపించాడు. ఘాటు ప్రేమలో మునిగితేలాడు. కొందరితో సీరియల్‌ లవ్‌ స్టోరీని నడిపిస్తే, మరికొందరితో కేవలం డేటింగ్‌ వరకే పరిమితమయ్యాడు. కొంత కాలం డేటింగ్‌ చేసి ఆ తర్వాత బ్రేక్‌ చెప్పడం జరిగిపోయాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

చివరగా ఆయన పూజాహెగ్డేతోనూ ప్రేమలో పడినట్టు వార్తలు వచ్చాయి. పుకార్లు గట్టిగా వినిపించాయి. కానీ అవి ఎక్కువ కాలం నిలవలేదు. కత్రినా కైఫ్‌, జాక్వెలిన్‌,  ఇలా చాలా మంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఒక్కరితో లవ్‌ ట్రాక్‌ మాత్రం చాలా సీరియస్‌గా తీసుకున్నాడు సల్మాన్‌. పెళ్లికి సిద్ధమయ్యాడు. కానీ అది వర్కౌట్‌ కాలేదు. 
 

311

సల్మాన్‌ ఖాన్‌ కెరీర్‌ ప్రారంభంలో షాహీన్‌ జఫ్రీ తో లవ్‌ స్టోరీ నడిపించారు. ఆ తర్వాత సంగీత బిజ్లానీతో డేటింగ్‌ చేశాడు. సోమీ అలీతోనూ ప్రేమలో ఉన్నాడు. ఈ ఇద్దరు పెళ్లికి రెడీ అవుతున్నారనే వార్తలు వచ్చాయి. కానీ అప్పుడే తన జీవితంలోకి విశ్వసుందరి వచ్చింది. సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన `హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌` చిత్రంలో హీరోయిన్‌గా ఐశ్వర్యా రాయ్‌ని తీసుకున్నారు. 
 

411

ఐశ్వర్య రాయ్‌.. 1994లో మిస్‌ వరల్డ్ అయ్యాక ఆమె సినిమా ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో మణిరత్నం `ఇరువర్‌` మూవీతో హీరోయిన్‌గా పరిచయం చేశారు.  తమిళ చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైన ఐశ్వర్య రాయ్‌.. హిందీలో `ఔర్‌ ప్యార్‌ హో గయా`, `ఆ అబ్‌ లౌట్‌ చలెన్‌` చిత్రాలు చేసింది. భన్సాలీ.. సల్మాన్‌తో చేస్తున్న `హమ్‌ దిల్‌ దే చుకే సనమ్‌` సినిమా కోసం హీరోయిన్‌ వెతుకుతుండగా సల్లూ భాయ్‌.. ఐష్‌ పేరుని సూచించాడు. దీంతో ఈ కాంబినేషన్‌ సెట్‌ అయ్యింది. సినిమా అయిపోయేలోపు ఇద్దరు ప్రేమలో పడ్డారు. 

511

అప్పటికే సల్మాన్‌.. సోమీ అలీతో ప్రేమలో ఉన్నారనేది తెలిసింది. కానీ ఐష్‌తో సల్మాన్‌ క్లోజ్‌గా ఉన్నాడనే విసయం తెలయగానే ఆమె బ్రేకప్‌ చెప్పింది. దీంతో ఐశ్వర్యాతో డీప్‌ లవ్‌లో పడ్డారు సల్మాన్‌. చాలా రోజులుగా ఈ ఇద్దరు ఘాటు ప్రేమలో మునిగితేలారు. ఆ ప్రేమని పెళ్లి వరకు తీసుకెళ్లాలనుకున్నారు. కానీ వర్కౌట్‌ కాలేదు. 

611

అయితే సల్మాన్‌తో ఐశ్వర్య మొదటిసారి ప్రేమలో పడటంతో ఆయనపై అమితమైన ప్రేమని చూపించింది. ఆయన ప్రేమలో మునిగితేలింది. ఆ ప్రేమని పలు రకాలుగా బయటపెడుతూ వచ్చిందట. ఈ క్రమంలో ఓ ఈవెంట్‌లో ఆమె ఈ ప్రేమని వ్యక్తం చేసింది. స్టేజ్‌పై పాట పాడింది.పరోక్షంగా సల్మాన్‌పై ఆమె పాట రూపంలో ఆ లవ్‌ని వ్యక్తం చేయడం విశేషం. 

711

అందులో సల్మాన్‌ ఖాన్‌, తన సోదరుడు అర్బాజ్‌ ఖాన్‌, ఆయన భార్య మలైకా అరోరా కూడా ఉన్నారు. ఆమె సల్మాన్‌ పక్కనే ఉండటం విశేషం. ఐశ్వర్య పాట పాడుతుండగా సల్మాన్‌ మురిసిపోతున్నాడు. పక్కనే ఉన్న ఫ్రెండ్‌ ఆ విషయాన్ని సల్మాన్‌తో చెబుతున్నారు. దీంతో మరింతగా ఉప్పొంగిపోయాడు సల్మాన్‌. పక్కనే ఉన్న మలైకా కూడా నవ్వులు చిందించింది. ఆమెని చూస్తూ మురిసిపోయాడు సల్లూభాయ్‌. ఈ అరుదైన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది.
 

811

ఇదిలా ఉంటే ఐశ్వర్య రాయ్‌ని పెళ్లి చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు సల్మాన్‌. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఐష్‌ పేరెంట్స్ కి ఈ విషయం నచ్చలేదు. అప్పటికే సల్మాన్‌ లవ్‌ స్టోరీస్‌ వారికి తెలుస్తుంది. అందుకే దూరం పెట్టాలని వాళ్లు డిమాండ్‌ చేస్తే, అలాంటి వాడు కాదని నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది. తనకు సక్సెస్‌లురావడంతో స్టార్‌డమ్ వచ్చింది. వరుసగా సినిమా ఆఫర్లు వచ్చాయి. దీంతో ఐష్‌ కెరీర్‌పై ఫోకస్‌ పెట్టింది. 

911

అప్పటికే సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న సల్మాన్‌..ఐష్‌ని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని ఆమెతో చెబితే దాటవేస్తూ వచ్చింది. ఓ సందర్భంలో నిలదీశాడు. ఇతర సినిమాల సెట్లకి కూడా వచ్చి ఒత్తిడి తెచ్చాడు. దీంతో షారూఖ్‌ సినిమాలో ఆఫర్‌ని కూడా మిస్‌ చేసుకుందట. ఇక రాత్రి తాను ఉండే ఫ్లాట్‌కి వచ్చి గోల చేశాడు. డోర్‌ తీయాలని కొడుతూనే ఉన్నాడట. రాత్రంతా అలానే కొడుతూ ఉన్నాడని, ఇక చనిపోతా అని బెదిరించడంతో తలుపు తీసిందట. తాను బ్రేకప్‌ చెప్పిందట. అయినా ఆమెని ఫోన్‌లో వేధించేవాడట. 

1011

అలా కొంత కాలానికి సల్మాన్‌ సైలెంట్‌ అయినట్టు సమాచారం. అప్పట్నుంచే పెళ్లిపై ఇంట్రెస్ట్ ని కోల్పోయాడని టాక్‌. నిజమేంటనేది తెలియదు.ఆ తర్వాత సల్మాన్‌.. కత్రినా కైఫ్‌, మెహెక్‌ చహల్‌, లువియా వాంటూర్‌, క్లాడియా కెస్లా, సమంత లాక్‌వుడ్‌, జాక్వెలిన్‌ వంటి వారితో డేట్‌ చేశాడు సల్మాన్‌. 

1111

ఐశ్వర్య రాయ్‌.. కెరీర్‌పై ఫోకస్‌ పెట్టి, అభిషేక్‌ బచ్చన్‌ని ప్రేమించి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంది. 2007లో వీరి మ్యారేజ్‌ జరిగింది. వీరికి కూతురు ఆద్య జన్మించారు. త్వరలో ఆమె హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఐశ్వర్యా రాయ్‌.. చివరగా `పొన్నియిన్‌ సెల్వన్‌` చిత్రాల్లో మెరిసిన విసయం తెలిసిందే. నందిని పాత్రలో మెరిసింది. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Toxic Review: టాక్సిక్‌ మూవీ ఫస్ట్ రివ్యూ.. యష్‌ దెబ్బకి బాక్సాఫీస్‌ షేక్‌, కానీ షాకింగ్‌ రిపోర్ట్
Recommended image2
Chiranjeevi: ఎస్పీ బాలు సంగీతం అందించిన సినిమా.. సుమన్, విజయశాంతి లకు చుక్కలు చూపించిన చిరంజీవి
Recommended image3
Irumudi 4 Days Collections: సోమవారం ఇరుముడి ఊరమాస్‌.. రవితేజ సినిమాకి మైండ్‌ బ్లాక్‌ అయ్యే కలెక్షన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved