Asianet News TeluguAsianet News Telugu

షుగర్ వ్యాధితో బాధపడుతున్న 7, 3 యేళ్ల చిన్నారులు.. తట్టుకోలేక ఆ కుటుంబం చేసిన పని...

తమ కళ్లముందే తమ కూతుర్లు మధుమేహం బారిన పడి అవస్త పడుతుంటే చూసి తట్టుకోలేని తల్లిదండ్రులు.. కుటుంబం మొత్తం కలిసి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. 

four members family committed suicide in tamil nadu
Author
First Published Dec 28, 2022, 8:55 AM IST

తమిళనాడు : కన్నబిడ్డలకు ఏదైనా అయితే తల్లిదండ్రులు తల్లడిల్లిపోతారు. వారి కోసం తమ ప్రాణాలు కూడా అడ్డువేస్తారు.  అలాంటి విషాద ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. ఓ దంపతుల 7, 3 యేళ్ల  వయసున్న ఇద్దరు బిడ్డలు షుగర్ వ్యాధి బారిన పడ్డారు. ముప్పైలు, నలభైల్లో రావాల్సిన వ్యాధి ఆ చిన్నారులను లేత వయసులోనే వేధించడం మొదలుపెట్టింది. తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా చికిత్సలు చేపించిన అదుపులోకి రాకపోవడంతో.. వారి బాధను చూడలేక తల్లిదండ్రులు దారుణమైన నిర్ణయం  తీసుకున్నారు. 

కుటుంబమంతా కలిసి మంగళవారం పాలారులో దూకారు. ఒకేసారి నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. యువరాజ్ (35)పాన్ విళి (30) అనే దంపతులు తమిళనాడులో సేలం నగరంలో పరిధిలోని దాదగాపట్టి నెసవాలర్ కాలనీలో ఉంటున్నారు. వీరికి నితీషా (7), అక్షర (5) అనే కూతుర్లున్నారు. మూడేళ్ల క్రితం పెద్ద కూతురు నితీషా మధుమేహం బారిన పడింది. అప్పటినుంచి బాలికకు అనేక రకాలుగా చికిత్స చేయిస్తున్నారు.

జమ్మూలోని సిధ్రా ప్రాంతంలో కొనసాగుతున్న ఎన్ కౌంటర్.. చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు

ఈ క్రమంలో మూడురోజుల క్రితం చిన్న కూతురు అక్షరకు కూడా మధుమేహం బారినపడింది. పెద్దకూతురి అనుభవంతో.. చిన్నకూతురిలో లక్షణాలు కనిపించగానే వైద్య పరీక్షలు చేయించగా.. విషయం తేలింది. దీంతో ఆ దంపతులు తట్టుకోలేకపోయారు. కూతుర్లిద్దరూ పడే కష్టాన్ని తలుచుకుని మనోవేదనకు గురయ్యారు. దీనికి తోడు చికిత్సకయ్యే ఆర్థిక భారం వారిని కుంగదీసింది. 

దీంతో దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. సోమవారం నాడు యువరాజు తన ఇద్దరు చెల్లెళ్ళు, తమ్ముడి పేరిట ఓ లేఖ రాసి పెట్టాడు. ఆ తర్వాత భార్యను, కూతుళ్లను తీసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోయాడు. ఆ ఉత్తరం చదివిన తమ్ముడు, చెల్లెళ్లు అతని కోసం తీవ్రంగా గాలించారు. మంగళవారంనాడు ఆడి పాలారు నదిలో  నలుగురు మృతదేహాలు లభించాయి. మెట్టూరు సమీపంలోని తమిళనాడు-కర్ణాటక సరిహద్దుల్లో ఈ రోడ్ జిల్లా పరిధిలో ఈ నది ఉంది.

నదిలో మృతదేహాలు తేలుతుండటంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే భవానీ డీఎస్పీ అమృతవర్షిని ఘటనా స్థలానికి చేరుకున్నారు. యువరాజ్, పాన్ విలి, నితీషా, అక్షర మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం అందియూరు జీహెచ్ కు పంపించారు. దీని మీద కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు విచారణ చేపట్టారు. తమ్ముడు, చెల్లెళ్లకు రాసిన ఉత్తరాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దీని ఆధారంగా వీరి కుటుంబం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చునని భావిస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios