Asianet News TeluguAsianet News Telugu

భార‌తీయ లేబ‌ర్ మార్కెట్ లో 99 శాతం మ‌హిళ‌ల‌పై లింగ వివ‌క్ష.. తేల్చి చెప్పిన ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక

దేశం ఎన్నో రంగాల్లో ముందుకు వెళ్తోంది. అనేక విజయాలు సాధిస్తోంది. కానీ మన దేశంలో ఇంకా మహిళపై ఇంకా వివక్ష కొనసాగుతూనే ఉంది. ఒకటి కాదు, రెండు కాదు చాలా రంగాల్లో ఈ లింగ వివక్ష ఉందని తాజాగా విడుదలైన ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక - 2022 తేల్చి చెప్పింది. 

99 percent of women are discriminated against in the Indian labor market, according to Oxfam India's report.
Author
First Published Sep 15, 2022, 4:40 PM IST

భారతీయ కార్మిక మార్కెట్ లో మహిళలపై లింగ వివక్ష కొత్తది కాదు. అయితే తాజాగా విడుద‌లైన ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక -2022 దిగ్భ్రాంతికరమైన విష‌యాన్ని బహిర్గతం చేసింది. ఈ నివేదిక ప్ర‌కారం సగటున 99 శాతం మంది మహిళలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పరంగా లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో లేబర్ మార్కెట్ లో 100 శాతం, పట్టణ ప్రాంతాల్లో 98 శాతం ఉద్యోగాలు పొందడానికి మహిళలు లింగ వివక్షను ఎదుర్కొంటున్నారు. 2004- 2005, 2019-20 వరకు ఉపాధి, కార్మికులపై ప్రభుత్వ డేటా ఆధారంగా దీనిని రూపొందించారు.

మనీలాండరింగ్ కేసులో క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు ఈడీ నోటీసులు

ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక (ఆక్స్ఫామ్ ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్- 2022) భారతదేశంలో స్త్రీ ల‌కు పురుషులతో పాటు సమాన విద్యార్హత‌లు, సమాన పని అనుభవం ఉన్నప్పటికీ సామాజిక, యజమానుల పక్షపాతాల కారణంగా కార్మిక మార్కెట్లో వివక్ష సర్వసాధారణమైంద‌ని చెప్పింది. స్వయం ఉపాధి పొందుతున్న మ‌హిళ‌ల కంటే పురుషులు 2.5 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారు. మగ, ఆడ సాధారణ వేతన కార్మికుల ఆదాయాల మధ్య 95 శాతం వ్యత్యాసానికి ఈ వివక్షే కార‌ణంగా ఉంది. లింగ వివక్ష కారణంగా పురుషులు, మహిళల మధ్య ఉపాధి అంతరం 98 శాతం ఉందని నివేదిక పేర్కొంది.

93 శాతం కేసుల్లో స్త్రీ , పురుషుల సంపాదనలో తేడా రావడానికి కూడా లింగ వివక్షే కారణం. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళల కంటే గ్రామీణ స్వయం ఉపాధి పురుషులు రెండింతలు సంపాదిస్తున్నారు. మగ వర్కర్లు ఆడవారి కంటే నెలకు రూ.3,000 ఎక్కువగా సంపాదిస్తారు. 96 శాతం కేసుల్లో వివక్ష కారణంగానే ఈ పరిస్థితిస్థి నెలకొంది. జీతాలు తీసుకునే మహిళలు 67 శాతం వివక్ష వ‌ల్ల, 33 శాతం విద్య, పని అనుభవం లేకపోవడం వల్ల తక్కువ వేతనాలు పొందుతున్నార‌ని నివేదిక పేర్కొంది. 

ఆద్యంతం అద్భుతం.. ఛాయ్ వాలా నుంచి ప్రధాని దాకా నరేంద్ర మోడీ లైఫ్ జర్నీ..

మహిళలతో పాటు, దళితులు, ఆదివాసీలు వంటి చారిత్రాత్మకంగా అణచివేయబడిన వర్గాలు, ముస్లింలు వంటి మతపరమైన మైనారిటీలు కూడా ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలను పొందడంలో వివక్షను ఎదుర్కొంటున్నారని ఆక్స్‌ఫామ్ ఇండియా నివేదిక 2022 తెలిపింది.

మహిళలందరికీ సమాన వేతనం, పని చేసే హక్కు, రక్షణ కోసం సమర్థవంతమైన చర్యలను ముందస్తుగా అమలు చేయాలని ఆక్స్‌ఫామ్ ఇండియా ప్రభుత్వాన్ని కోరింది. వేతనాల పెంపుదల, నైపుణ్యాల‌ను పెంచడం, ఉద్యో గ రిజర్వేషన్లు,సులభమైన రాబడితో సహా శ్రామికశక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలని పేర్కొంది. ప్రసూతి తర్వాత పని చేయడానికి సుల‌భ‌మైన ప‌ని ఎంపిక‌లతో వ‌ర్క్ ఫోర్స్ తో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాల‌ని భారత ప్రభుత్వానికి పిలుపునిచ్చింది.

రేపిస్టులను విడుదల చేసే వారి నుంచి మహిళల‌ రక్షణ ఆశించలేం.. లఖింపూర్ ఘటనపై రాహుల్ గాంధీ మండిపాటు

ఆక్స్‌ఫామ్ ఇండియా సీఈఓ అమితాబ్ బెహర్ మాట్లాడుతూ.. పురుషులు, మహిళలు ఒకే స్థాయిలో పనిచేయడం ప్రారంభించినా ఆర్థిక రంగంలో మహిళలు వివక్షకు గురవుతున్నార‌ని నివేదికలో తేలిందని చెప్పారు. వివక్ష కారణంగా, మహిళలు జీతాలు, స్వయం ఉపాధిలో వెనుకబడి ఉన్నార‌ని చెప్పారు. కేవలం విద్య లేదా పని అనుభవం మాత్రమే కాకుండా లింగం కారణంగా సామాజిక వర్గాలకు కార్మిక మార్కెట్ లో అసమానత ఎక్కువగా ఉంద‌ని తెలిపారు.  ‘‘భారతదేశంలోని అట్టడుగు వర్గాల జీవితాలపై వివక్ష, దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇప్పటివరకు చాలా తక్కువ ప్రయత్నాలు జరిగాయి ” అని బెహర్ చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios