Asianet News TeluguAsianet News Telugu

రేపిస్టులను విడుదల చేసే వారి నుంచి మహిళల‌ రక్షణ ఆశించలేం.. లఖింపూర్ ఘటనపై రాహుల్ గాంధీ మండిపాటు

రేపిస్టులను జైలు నుంచి విడుదల చేసే వారి వద్ద నుంచి మహిళల రక్షణ ఆశించలేమని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. లంఖిపూర్ ఖేరీ ఘటనపై ఆయన బీజేపీని తీవ్రంగా నిందించారు. 

Protection of women cannot be expected from those who release rapists.. Rahul Gandhi on Lakhimpur incident
Author
First Published Sep 15, 2022, 2:25 PM IST

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఇద్దరు దళిత బాలికలను హత్య చేసి, చెట్టుకు వేళాడదీసిన ఘటనపై కాంగ్రెస్ నాయ‌కుడు రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని నిందించారు. రేపిస్టుల విడుదలను సులభతరం చేసే వారి నుండి మహిళల భద్రతను ఆశించలేమని తీవ్రంగా ఆక్షేపించారు. బిల్కిస్ బానో గ్యాంగ్‌రేప్ కేసులో 11 మంది దోషులు గుజరాత్ ప్రభుత్వ ఉపశమన విధానం ప్రకారం గత నెలలో గోద్రా సబ్ జైలు నుండి విడుదల‌వ‌డం, తాజాగా ఘ‌ట‌న బీజేపీ పాలిత ప్రాంతంలో జ‌రిగిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 

ప్రధాని మోడీ పుట్టినరోజున భారత అడ‌వుల్లోకి చేరే 8 నమీబియా చిరుతల వివరాలు ఇవిగో..

‘‘ పట్టపగలు లఖింపూర్‌లో ఇద్దరు మైనర్ దళిత సోదరీమణులను కిడ్నాప్ చేసి హత్య చేశారు. ఇది చాలా ఆందోళ‌న క‌లిగించే సంఘ‌ట‌న ’’ అని రాహుల్ గాంధీ హిందీలో ట్వీట్ చేశారు. ‘‘ రేపిస్టులను విడుదల చేసేవారిని, రేపిస్టులకు స్వాగతం పలికే వారి నుంచి మహిళల భద్రతను ఆశించలేము ’’ అని ఆయ‌న పేర్కొన్నారు. దేశంలో మ‌హిళ‌ల‌కు సుర‌క్షితమైన వాతావ‌ర‌ణాన్ని సృష్టించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర ప్ర‌స్తుతం కేర‌ళ‌లో కొన‌సాగుతోంది.

PM Modi birthday: బిజీ షెడ్యూల్ మధ్య ఈ వారంలోనే 72వ బర్త్ డే జరుపుకోనున్న ప్రధాని మోడీ

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో ఈ దారుణం జ‌రిగింది. నిఘాసన్ ప్రాంతంలో ఇద్దరు ద‌ళిత మైన‌ర్లు (ఇందులో ఒక‌రికి 15 ఏళ్లు కాగా.. మ‌రొక‌రికి 17 ఏళ్లు) బుధవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో త‌న త‌ల్లితో క‌లిసి ఇంటి బ‌య‌ట కూర్చొని ఉన్నారు. కొంత స‌మ‌యం త‌రువాత త‌ల్లి ఇంట్లోకి వెళ్లింది. దీంతో ఓ ముగ్గురు యువ‌కులు బైక్ పై అక్క‌డికి చేరుకున్నారు. అందులో ఇద్ద‌రు యువ‌కులు త‌మ కూతుళ్లను లాగి బైక్ పై కూర్చొబెట్టి ఇద్ద‌రితో క‌లిసి క‌లిసి అక్క‌డి నుంచి పారిపోయారు. అనంత‌రం ఆ సోదరీమణుల మృతదేహాలు బుధవారం అనుమానాస్పద స్థితిలో చెట్టుకు వేలాడుతూ కనిపించాయి. ఈ ఘ‌ట‌న స్థానికంగా క‌ల‌క‌లం సృష్టించింది. అయితే ముగ్గురు వ్య‌క్తులు త‌మ పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసి హత్య చేశారని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘ‌ట‌న దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అన్ని రాజ‌కీయ పార్టీల నాయ‌కులు దీనిపై స్పందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. యూపీలో మహిళలపై క్రూరమైన నేరాలు పెరగడం వెనుక కారణాన్ని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎత్తి చూపారు. వార్తాపత్రికలు, టీవీలలో తప్పుడు ప్రకటనలు చేయ‌డం వ‌ల్ల శాంతిభద్రతలు మెరుగుప‌డ‌వ‌ని పేర్కొన్నారు. “ లఖింపూర్ (యూపీ)లో ఇద్దరు అక్కాచెల్లెళ్ల హత్య ఘటన హృదయ విదారకంగా ఉంది. ఆ అమ్మాయిలను పట్టపగలు కిడ్నాప్ చేశారని బంధువులు చెబుతున్నారు’’ అని హిందీలో ట్వీట్ చేసింది.

ల‌ఖింపూర్ ఖేరీ: ద‌ళిత అక్కాచెల్లెళ్లపై అత్యాచారం, హ‌త్య కేసులో ఆరుగురి అరెస్టు

ఈ ఘటనలో నిందితులుగా ఉన్న ఆరుగురుని అరెస్టు చేశామ‌ని లఖింపూర్ ఖేరీ పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) మీడియాకు గురువారం తెల‌పారు. ‘‘ రాత్రి సమయంలో నిర్వహించిన  ఆపరేషన్‌లో జునైద్, సోహైల్, హఫీజుర్ రెహ్మాన్, కరీముద్దీన్, ఆరిఫ్, ఛోటులను అరెస్టు చేశాము ’’ అని పేర్కొన్నారు. జునైద్, సోహైల్ ఇద్దరు సోదరీమణులతో సంబంధం కలిగి ఉన్నారని ఆయ‌న చెప్పారు. వారిద్దరూ మైనర్ అక్కాచెళ్లెల్లను తమ వెంట రావాలని ఒప్పించార‌ని ప్రాథ‌మిక విచార‌ణ‌లో తేలింద‌ని పేర్కొన్నారు. బాలిక‌లు వారితో వెళ్లిన త‌రువాత నిందితులు వారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశార‌ని ఎస్పీ తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios