Asianet News TeluguAsianet News Telugu

మనీలాండరింగ్ కేసులో క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కు ఈడీ నోటీసులు

DK Shivakumar: పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ప్రారంభించిన దేశ‌వ్యాప్త "భార‌త్ జోడో యాత్ర" మ‌రికొద్ది రోజుల్లో క‌ర్నాట‌క‌కు చేరుకోవ‌డంతో పాటు రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో ఈడీ త‌న‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ తెలిపారు.
 

Karnataka : ED summons issued to DK Sivakumar again in money laundering case
Author
First Published Sep 15, 2022, 3:58 PM IST

Enforcement Directorate (ED): ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలతో పాటు మరికొద్ది రోజుల్లో కర్ణాటకలో అడుగుపెట్టబోతున్న పార్టీ 'భారత్ జోడో యాత్ర' మధ్యలో ఈడీ త‌న ముందు హాజ‌రు కావాల‌ని త‌న‌కు నోటీసులు ఇచ్చింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ చెప్పారు.

వివ‌రాల్లోకెళ్తే..  పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వంలో కాంగ్రెస్ ప్రారంభించిన దేశ‌వ్యాప్త భార‌త్ జోడో యాత్ర మ‌రికొద్ది రోజుల్లో క‌ర్నాట‌క‌కు చేరుకోనుంది. అలాగే, రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. ఇలాంటి స‌మ‌యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) త‌న‌కు మ‌రోసారి నోటీసులు ఇచ్చింద‌ని క‌ర్నాట‌క కాంగ్రెస్ చీఫ్ డీకే శివ‌కుమార్ తెలిపారు. ఈ క్ర‌మంలోనే కేంద్రంతో పాటు ద‌ర్యాప్తు ఏజెన్సీల‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. “#BharatJodoYatra, అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గున్న స‌మ‌యం మధ్యలో.. త‌మ‌ముందు హాజ‌రుకావాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నాకు సమన్లు ​​జారీ చేసింది. నేను ఏజెన్సీల‌కు సహకరించడానికి సిద్ధంగా ఉన్నాను.. కానీ ఈ స‌మాన్లు పంపిన స‌మ‌యం.. నన్ను వేధించడం నా రాజ్యాంగ-రాజకీయ విధులను విధులను నిర్వర్తించడానికి అడ్డంకిగా వస్తున్నాయి” అని డీకే శివకుమార్ ట్విట్టర్‌లో  పేర్కొన్నారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో అవినీతికి వ్యతిరేకంగా కర్ణాటక కాంగ్రెస్ ప్రచారాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ) ని టార్గెట్ చేస్తూ '40 ప‌ర్సెంట్ స‌ర్కార్ క్యాంపెయిన్'ను ప్రారంభించింది. పౌరులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ కోరింది. ఫిర్యాదులన్నింటినీ తీసుకుంటామనీ, అవినీతికి వ్య‌తిరేకంగా పోరాటం సాగిస్తామ‌ని తెలిపింది. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ కర్ణాటక కాంగ్రెస్ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వాన్ని (బీజేపీ) లక్ష్యంగా చేసుకుని ప్రచారాన్ని ప్రారంభించింది. www.40percentsarkara.com వెబ్‌సైట్ లో పౌరులు త‌మ‌కు జ‌రిగిన అవినీతి పిర్యాదుల‌ను న‌మోదుచేయాల‌ని కోరింది. కాంగ్రెస్ పార్టీ పౌరుల కోసం అవినీతిపై పోరాటం సాగిస్తుంద‌ని తెలిపారు.

తన క్యాబినెట్ లోని మంత్రులు పూర్తిగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనీ, దోచుకుంటున్నారని ముఖ్య‌మంత్రి బసవరాజ్ బొమ్మైకి తెలుసునని మాజీ ముఖ్యమంత్రి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. అనంతరం శివకుమార్ '40 శాతం కమీషన్ ప్రభుత్వం'పై ప్రచార గీతాన్ని విడుదల చేశారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో అసెంబ్లీ స‌మావేశాలు కూడా జ‌ర‌గ‌నున్నాయి. ప్ర‌స్తుతం కాంగ్రెస్ దేశ‌వ్యాప్త యాత్ర కొన‌సాగుతోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని 3,570 కిలోమీటర్ల 'భారత్ జోడో యాత్ర' ప్రస్తుతం కేరళలో ప్రయాణిస్తూ అక్టోబర్ 1న కర్ణాటకలో ప్రవేశించనుంది. ఈ యాత్ర క‌న్యాకుమారి నుంచి కాశ్మీర్ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. ఈ యాత్రంలో ప్ర‌జా వ్య‌తిరేక నిర్ణ‌యాల‌ను కాంగ్రెస్ ఎత్తిచూపుతోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios