మహారాష్ట్రలో దారుణం జరిగింది. ఐదేళ్ల చిన్నారి అత్యాచారానికి గురై, ఆ గాయాలతో ఆమె చనిపోయింది. వివరాల్లోకి వెళితే... అహ్మద్‌నగర్ జిల్లా కారేగావ్ గ్రామానికి చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు శనివారం సాయంత్రం ఆటవిడుపు కోసం బయటికి వెళ్లారు. సరదాగా అటు ఇటు తిరిగి తిరిగి ఇంటికి వస్తుండగా ఐదేళ్ల వయసున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

గ్రామస్తుల సాయంతో ఆమె తన సోదరిని శ్రీరాంపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించింది. అక్కడ చిన్నారిని పరిశీలించిన వైద్యులు బాలిక చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం పోస్ట్ మార్టం నివేదికను పోలీసులకు అందజేయగా.. అందులో బాలిక అత్యాచారానికి గురైందని.. ఆమె ప్రైవేట్ భాగాల్లో అంతర్గత రక్తస్రావం కారణంగా చిన్నారి చనిపోయిందని తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు చిన్నారిపై అత్యాచారం సంఘటన క్షణాల్లో అహ్మద్ ‌నగర్ జిల్లా మొత్తం వ్యాపించడంతో దళిత సంఘాలు భగ్గుమన్నాయి. ఇందుకు నిరసనగా శ్రీరాంపూర్ పట్టణంలో బంద్‌కు పిలుపునిచ్చాయి. 

చిన్నారిపై అత్యాచారం.. అర్థరాత్రి నడిరోడ్డుపై వదిలివెళ్లిన దుండగుడు

చిన్నారిపై అత్యాచారం, హత్య: తలను ముక్కలుగా నరికి, వెన్నెముక విరిచేసి..

చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడికి ఉరి శిక్ష

హైదరాబాద్ లో దారుణం: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, గోళ్లతో రక్కి, చేతులు విరిచి హత్య

గురుపూజ చేసి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గొంతునులిమి హత్య

ఢిల్లీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మార్కెట్‌లో పడేసిన కామాంధులు

చిన్నారిపై అత్యాచారం.. మర్మావయవాల్లోకి రాడ్..బయటకొచ్చిన పేగులు

ఎనిమిది నెలల చిన్నారిపై అత్యాచారం