గురుపూజ చేసి వస్తున్న ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. గొంతునులిమి హత్య

7 year old raped and murdered in rajasthan
Highlights

రాజస్థాన్‌లో దారుణం జరిగింది.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి దారుణంగా హతమార్చారు

రాజస్థాన్‌లో దారుణం జరిగింది.. ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి దారుణంగా హతమార్చారు. ఝాలావార్ ప్రాంతానికి చెందిన ఏడేళ్ల చిన్నారి గత శుక్రవారం గురుపూర్ణిమ కావడంతో తన ఇంటి సమీపంలో జరుగుతున్న పూజా కార్యక్రమానికి వెళ్లింది.. కార్యక్రమం ముగియడంతో తిరిగి ఇంటికి బయలుదేరింది. కానీ సమయం గడుస్తున్నా తమ కుమార్తె జాడ తెలియకపోవంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు.

నిన్న ఉదయం వీరి ఇంటికి 200 మీటర్ల దూరంలో చిన్నారి మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. వెంటనే ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించగా.. నివేదికలో చిన్నారిపై అత్యాచారం జరిగిందని... అనంతరం గొంతు నులిమి హతమార్చినట్లు తేలింది.

దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దించారు.. కాగా, నెలల ఝాలావార్ ప్రాంతంలో చిన్నారిపై అత్యాచారం జరిపి.. హతమార్చడం ఇది రెండోసారి.. ఫిబ్రవరి నెలలో ఆరేళ్ల చిన్నారిని అపహరించిన దుండగులు ఆమెపై అత్యాచారం చేసి హతమార్చారు.రెండు రోజుల తర్వాత చిన్నారి మృతదేహం సమీపంలోని పొలాల్లో కనిపించింది. 

loader