కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ కామాంధుడు చిన్నారిపై అత్యాచారం చేయడంతో పాటు అత్యంత పైశాచికంగా ఆమె మర్మావయవాల్లోకి రాడ్ చొప్పించి కొన్ని గంటలపాటు చిన్నారికి నరకం చూపించాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ దారుణ ఘటన మరోసారి దేశప్రజలకు నిర్భయ ఉదంతాన్ని గుర్తు చేసింది. మందసౌర్‌లో బుధవారం సాయంత్రం బడి నుంచి ఆనందంగా బయటకు వచ్చి తన తండ్రి కోసం వేచి చూస్తోన్న ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు.

నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం జరిపాడు. ఆమె అరవకుండా గొంతులో పదునైన ఆయుధాన్ని ఉంచాడు.. అనంతరం బాలిక మర్మావయవాల్లోకి రాడ్ లేదా చెక్కను చొప్పించి.. పదే పదే తిప్పాడు.. దీంతో పొత్తికడుపులోంచి పేగులు బయటకు వచ్చాయి. అచేతనంగా పడివున్న ఆ బాలికను కొందరు రైతులు ఆస్పత్రికి తరలించారు..  చిన్నారికి చికిత్స చేస్తున్న వైద్యులు ఆ సమయంలో వణికిపోయారంటే ఆ దుర్మార్గుడు ఏ స్థాయిలో రాక్షసకాండ చేశాడో అర్ధం చేసుకోవచ్చు.

బాలిక పడుతున్న నరకం వారిని కదిలించి వేసింది.. తమ వైద్య జీవితంలో ఇలాంటి దృశ్యాన్ని చూడలేదని నివ్వెరపోయారు. గంటలపాటు శ్రమించి.. అవసరమైన సర్జరీలు జరిపి.. చిన్నారి ప్రాణాలు కాపాడారు. ఈ కేసులో ఇర్ఫాన్ అనే యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.. అప్పటికే పట్టణమంతా బాలికపై అత్యాచారం ఘటనతో ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు..

అతన్ని ఉరి తీయాలంటూ బంధువులు, ప్రజాసంఘాలు, స్థానికులు బంద్ పాటించారు.. అతను చస్తే.. అతని మృతదేహాన్ని తమ శ్మశానంలో పూడ్చనీయబోమని ముస్లిం మతపెద్దలు ప్రకటించారు. అతన్ని స్టేషన్ నుంచి బయటకు తీసుకువస్తే..జనం చంపేస్తారని భావించిన పోలీసులు న్యాయమూర్తిని పీఎస్‌కు రప్పించారు.. జడ్జి ఇర్ఫాన్‌కు రిమాండ్ విధించారు.