గురుగ్రామ్‌లో చిన్నారిపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. ఆమెను నానారకాలుగా హింసించి, దారుణంగా హత్య చేశాడు ఓ కామాంధుడు. ఓ కుటుంబం ఉపాధి కోసం బెంగాల్ నుంచి గురుగ్రామ్‌కు వలస వచ్చింది. వీరి కుటుంబం సెక్టార్ 66 లోని మురికివాడలో నివసిస్తున్నారు.

కూలీ పనులు చేసుకునే వారికి దినసరి వేతన జీవులకు ఈ ప్రాంతం అడ్డా. ఈ మురికివాడ పక్కనే పశువుల కొట్టాలు.. పశుగ్రాసం భద్రపరిచే గోడౌన్‌లతో నిండివుంటుంది. ఇక్కడ నివసించే చాలా మంది వాటిల్లోనే పనిచేస్తూ ఉంటారు.

ఆదివారం ఉదయం వీరి పాప ఆడుకుంటోంది. భార్యాభర్తలు పిల్లలను ఇంట్లో వదిలేసి పనికి వెళ్లారు.. అయితే సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన వీరికి పాప కనిపించలేదు.. చుట్టుపక్కల వారి సాయంతో పరిసర ప్రాంతాల్లో వెతికినప్పటికీ పాప ఆచూకీ దొరకలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటికే అర్థరాత్రి కావడంతో.. సోమవారం ఉదయం గాలింపు చర్యలు చేపడతామని చెప్పి పంపించారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పశుగ్రాసం తెచ్చేందుకు వెళ్లిన స్థానికుడొకరికి పాప మృతదేహం అత్యంత దారుణమైన స్థితిలో కనిపించింది. విషయానికి బాలిక తల్లిదండ్రులకు తెలిపి.. పోలీసులకు సమాచారం అందించాడు.

వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. క్లూస్ టీం సాయంతో ఆధారాల కోసం గాలించి.. చిన్నారి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పాపకు పోస్ట్‌మార్టం చేసిన వైద్యులు వణికిపోయారు.

బాలిక అత్యాచారానికి గురైందని.. ఆమె ముందు, వెనుక భాగాల్లోకి కర్రను చొప్పించడంతో పేగులు ఛిద్రమయ్యాయని... అనంతరం బండరాయితో బాలిక శరీరాన్ని మోదడంతో వెన్నెముకతో పాటు తల పగిలిపోయి పాప చనిపోయిందని చెప్పారు.

నిందితుడిని అదే ప్రాంతానికి చెందిన సునీల్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఇతను వారం క్రితం సోదరిలతో కలిసి ఉపాధి కోసం గురుగ్రామ్‌కి వచ్చాడని.. తాగుడికి బానిసై ఉద్యోగం కోసం వెతుకుతున్నాడని.. అతని సోదరీలు చుట్టుపక్కల ఇళ్లల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారని వెల్లడించారు.

పోలీసులు తమదైన శైలీలో విచారించగా తానే చిన్నారిని అపహరించి, అత్యాచారం చేసి హత్యమార్చినట్లు సునీల్ అంగీకరించాడు. అతనిపై ఐపీసీ సెక్షన్ 302తో పాటు పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మరోవైపు బాలికపై అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. దారుణంగా హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని పలు స్వచ్ఛంద సంస్థలు గురుగ్రామ్‌లో ఆందోళన నిర్వహించాయి. 

చిన్నారిపై అత్యాచారం చేసిన కామాంధుడికి ఉరి శిక్ష

హైదరాబాద్ లో దారుణం: మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం, గోళ్లతో రక్కి, చేతులు విరిచి హత్య

ఢిల్లీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం.. మార్కెట్‌లో పడేసిన కామాంధులు

చిన్నారిపై అత్యాచారం.. మర్మావయవాల్లోకి రాడ్..బయటకొచ్చిన పేగులు

గుంటూరు జిల్లాలో మరో కీచకసంఘటన: ఏడేళ్ల చిన్నారిపై అత్యాచారం