హైదరాబాద్‌: హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో దారుణం జరిగింది. మూడో తరగతి విద్యార్థినిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన టోలిచౌకి అజాన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చోటు చేసుకుంది. గత కొద్దిరోజులుగా చిన్నారి నీరసంగా కనబడటంతో తల్లిదండ్రులు నీలోఫర్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు చిన్నారి అత్యాచారానికి గురైనట్లు నిర్ధారించారు. 

ముక్కుపచ్చలారని తమ కుమార్తెపై అత్యాచారం జరిగిందని వైద్యులు చెప్పడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గోల్కొండ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. అయితే స్కూల్ యాజమాన్యంలో ఓ వ్యక్తిపై తల్లిదండ్రలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానం వచ్చిన వ్యక్తి వివరాలను పోలీసులకు తెలిపారు. నిందితుడిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.