ప్రస్తుత కాలంలో పోర్న్ చూసే అలవాటు ఉన్నవారు... దానికి బానిసలుగా మారిన వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. అయితే... చాలా మంది తాము పోర్న్ వీడియోలు చూస్తున్నాం అన్న విషయం ఎవరికీ తెలియకుండా ఉండేందుకు ఇన్ కాగ్నిటో మోడ్ లో ఆ వీడియోలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. తాము అశ్లీల వీడియోలు చూస్తున్నట్లు ఎవరికీ తెలియదని ప్రైవేటు బ్రౌజింగ్ లను ఆశ్రయించినా కూడా కనిపెట్టుస్తున్నాని ఓ సర్వేలో తేలింది. మైక్రోసాఫ్ట్, కార్నిగీ మెలన్ యూనివర్శిటీ, యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా చేపట్టిన సర్వేలో ఈ విషయం వెల్లడయ్యింది.

వారు చేసిన సర్వే ప్రకారం.. 22,484అశ్లీల సైట్లలో 93శాతం సైట్లు థర్డ్ పార్టీ యాప్స్ కు డేటాను లీక్ చేస్తున్నట్లు తేలింది.  ప్రైవసీ పాలసీల్లో ఉన్న సంక్లిష్టతల ఆధారంగా యూజర్ల అనుమతి లేకుండానే ట్రాకర్లు ఆయా కంపెనీలకు పంపుతున్న డేటా ద్వారా యూజర్ల హ్యాబిట్స్ తెలుసుకుంటున్నారు. అంటే వారు ఎలాంటి పోర్న్ ని ఇష్టపడుతున్నారనే విషయాలను తెలుసుకుంటున్నారు.

పోర్న్ వెబ్ సైట్స్ చూసే యూజర్లకు చెందిన దాదాపు 93శాతం డేటాను థర్డ్ పార్టీకి ట్రాకర్లు చేరవేస్తున్నారు. అశ్లీల సైట్లలో కేవలం 17శాతం మాత్రమే సమాచార భద్రత కలిగి ఉన్నాయని పరిశోధనలో తేలింది. మిగిలిన వాటిలో ఎలాంటి భద్రత ఉండటం లేదని ద్వారా హ్యాకర్లకు మీ వివరాలు తెలిసే అవకాశం ఉంది.. తద్వారా బ్లాక్ మెయిల్స్ చేసే అవకాశం కూడా లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.