బ్రౌన్ రైస్ ఎలా తయారు చేస్తారో తెలుసా?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైసే మన ఆరోగ్యానికి చాలా  మంచిది. ఇదే ఎక్కువ పోషకమైనదని ఆరోగ్య నిపుణులు చెప్తారు. మరి ఈ బ్రౌన్ రైస్ ను ఎలా తయారుచేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

how brown rice is made rsl

వైట్ రైస్ తో పోలిస్తే బ్రౌన్ రైస్ యే మంచిది. ఇదే మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఈ రైస్ లో పోషకాలు కూడా మెండుగా ఉంటాయి. అందుకే కొంతమంది బ్రౌన్ రైస్ నే తింటుంటారు. ఈ బియ్యం వైట్ రైస్ కంటే కాస్త ఖరీదైనవే. కానీ ఆరోగ్యానికి మాత్రం చాలా మంచివి. 

అయితే బ్రౌన్ రైస్ ను ఎక్కువగా డయాబెటీస్, అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవారే ఎక్కువగా తింటుంటారు. వీళ్లకు మాత్రమే కాదు.. మిగతా వారు కూడా బ్రౌన్ రైస్ ను ఎంచక్కా తినొచ్చు. అయితే చాలా మందికి బ్రౌన్ రైస్ కి వైట్ రైస్ కి తేడా తెలియదు. ఈ బ్రౌన్ రైస్ ను ఎలా తయారుచేస్తారని డౌట్ వస్తుంటుంది. ఈ ప్రశ్నకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

బ్రౌన్ రైస్ ఎలా తయారు చేస్తారు?

how brown rice is made rsl

బ్రౌన్ రైస్ ను కూడా ఇతర వరి రకాల మాదిరిగానే సాగు చేస్తారు. బ్రౌన్ రైస్ ను వైట్ రైస్ మాదిరిగానే ఒరిజా సాటివా జాతి నుంచి తీసుకుంటారు. ఈ వరి మొక్కలు పక్వానికి వచ్చిన తర్వాత ధాన్యం కోతకు వస్తుంది. పంట చేతికొచ్చిన వెంటనే ధాన్యాన్ని ప్రాసెసింగ్ కోసం రైస్ మిల్లుకు తీసుకెళ్తారు.

మిల్లింగ్ ప్రక్రియ: రైస్ మిల్లుకు తీసుకెళ్లిన తర్వాత మిల్లింగ్ ప్రక్రియ మొదలవుతుంది. అయితే ఈ బ్రౌన్ రైస్ కు, వైట్ రైస్ మధ్య మిల్లింగ్ ప్రక్రియలో చాలా తేడా ఉంటుంది. ఈ బ్రౌన్ రైస్ మొత్తం ధాన్యంగానే పరిగణించబడుతుంది. ఎందుకంటే ఈ ప్రక్రియలో కేవలం వొడ్ల పొట్టు అని పిలువబడే బయటి పొరను మాత్రమే తొలగిస్తారు. దీంతో బ్రాన్ పొరలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ పొరల్లోనే విటమిన్లు, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇందుకే పోషణ పరంగా చూస్తే వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ యే బెటర్ అంటారు. ఇకపోతే వైట్ రైస్ ను బాగా మిల్లింగ్ చేస్తారు. ఎక్కువ పాలిష్, శుద్ధి చేయడం వల్ల వైట్ రైస్ లోనిపోషకాలన్నీ తొలగిపోతాయి. 

బ్రౌన్ రైస్ తయారీ విధానం ఎలా ఉంటుంది?

how brown rice is made rsl

కోసిన ధాన్యాన్నిమిల్లుకు తీసుకెళ్లి అక్కడ వీటి పై పొట్టును మాత్రమే తొలగిస్తారు. ఈ పొట్టు అనేది ఒక కఠినమైన రక్షిత పొర. ఇక మిగిలిందంతా బ్రౌన్ రైస్. దీనిలో బ్రౌన్ రైస్ పొరలు చెక్కుచెదరకుండా ఉంటాయి. ఈ బియ్యం పై పొట్టును తొలగించిన తర్వాత దుమ్ము వంటి మలినాలను తొలగించడానికి ధాన్యాలను బాగా శుభ్రపరుస్తారు. ఆ తర్వాత బ్రౌన్ రైస్ ను ప్యాకేజీ చేసి అమ్మకానికి పెడతారు. 

బ్రౌన్ రైస్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

మీకు తెలుసా? ఈ బ్రౌన్ రైస్ ను 9,000 సంవత్సరాలకు పైగా సాగు చేస్తూ వస్తున్నారు. అలాగే బ్రౌన్ రైస్ ఎన్నో ఏండ్లుగా రోజువారి ఆహారంలో భాగమైంది. పారిశ్రామిక విప్లవం సమయంలో మాత్రమే శుద్ధి ప్రక్రియ మెరుగుపడింది. ఈ బియ్యం చాలా కాలం వరకు నిల్వ ఉంటాయి. అలాగే దీనితో వంట చేయడం చాలా సులువు. అందుకే ఇది మంచి ప్రజాదరణ పొందింది. ఒక కప్పు బ్రౌన్ రైస్ లో 3.5 గ్రాముల ఫైబర్ కంటెంట్  ఉంటుంది. అదే వైట్ రైస్ లో ఒక గ్రాము కంటే తక్కువ ఫైబర్ ఉంటుంది. అంతేకాకుండా బ్రౌన్ రైస్ వైట్ రైస్ కంటే 80% ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది. అందుకే ఈ బియ్యాన్ని హెల్తీగా భావిస్తారు. 

ఒక కప్పు బ్రౌన్ రైస్ ను తీసుకుంటే మన శరీరానికి అవసరమైన మాంగనీస్ అందుతుంది. మాంగనీస్ అనేది ఒక ఖనిజం. ఇది మన ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ లో గ్లూటెన్ మొత్తమే ఉండదు. ఈ రైస్ ఉదరకుహర వ్యాధి ఉన్నవారికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే హైపోఆలెర్జెనిక్, ఫుడ్ అలెర్జీ ఉన్నవారికి కూడా మేలు చేస్తుంది. 

బ్రౌన్ రైస్ అనేది ఒక రకమైన వరి ధాన్యం మాత్రమే కాదు. ఈ బ్రౌన్ రైస్ చిన్నగా, మధ్యస్థ ధాన్యం, పొడవైన ధాన్యంతో పాటుగా ఎన్నో రకాల్లో లభిస్తుంది. ప్రతి రకం ధాన్యం దాని ఆకృతి, రుచిలో  భిన్నంగా ఉంటుంది. అంటే నమలడానికి సులభంగా, కొద్ది కొద్దిగా అంటుకోవడం నుంచి పొడిపొడిగా ఉండటం వరకు ఎన్నో రకాల్లో లభిస్తాయి. బ్రాన్ పొరల వల్ల బ్రౌన్ రైస్ వండడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. సాధారణంగా బ్రౌన్ రైస్ ను వండడానికి 45 నిమిషాల నుంచి గంట టైం పడుతుంది. అదే వైట్ రైస్ ను కేవలం 15 నుంచి 20 నిమిషాల్లో వండేయొచ్చు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios