Asianet News TeluguAsianet News Telugu

మోడల్ దారుణ హత్య.. నగ్నంగా మార్చి..!

దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె సవతి సోదరుడు ఫిర్యాదు చేసే వరకు ఈ విషయం గురించి  బయటకు  రాలేదు.

Pakistani model Nayab found dead at home in Lahore
Author
Hyderabad, First Published Jul 14, 2021, 8:41 AM IST

పాకిస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఓ మోడల్... అతి దారుణంగా హత్యకు గురైంది. ఆమె గొంతు కోసి.. కిరాతకంగా హత్య చేశారు. అనంతరం ఆమెను నగ్నంగా మార్చి.. ఆమె మృతదేహాన్ని ఇంట్లోనే పడేసి వెళ్లిపోయారు దుండగులు. కాగా.. ఆమె సవతి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదుతో  ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే...

పాకిస్తాన్ ప్రఖ్యాత మోడల్ నయాబ్ నదీమ్ ఆదివారం అనుమానాస్పద స్థితిలో హత్యకు గురయ్యారు. లాహోర్ లోని ఆమె నివాసంలో ఈ దారుణం చోటుచేసుకున్నట్లు పాకిస్తాన్ మీడియా వెల్లడించింది. దుండగులు ఆమె ఇంట్లోకి ప్రవేశించి.. హత్య చేసినట్లు తెలుస్తోంది. ఆమె సవతి సోదరుడు ఫిర్యాదు చేసే వరకు ఈ విషయం గురించి  బయటకు  రాలేదు.

సదరు మోడల్ కి ఇంకా వివాహం చేసుకోలేదు. లాహోర్‌లోని డిఫెన్స్‌ ఏరియాలో ఆమె ఒంటరిగా నివాసం ఉంటున్నారు. 

ఈ సందర్భంగా నయాబ్‌ సవతి సోదరుడు నసీర్‌ మాట్లాడుతూ.. ‘‘శనివారం అర్థరాత్రి మేం ఐస్‌క్రీం తినడానికి బయటకు వెళ్లాం. ఆ తర్వాత నేను తనను ఆమె ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్లాను. ఇంటికి వెళ్లాక నాకు నయాబ్‌ కాల్‌ చేసింది. కానీ పడుకుని ఉండటంతో తన కాల్‌ లిఫ్ట్‌ చేయలేదు. ఆదివారం ఉదయం తిరిగి తనకు కాల్‌ చేశాను. లిఫ్ట్‌ చేయలేదు. దీంతో.. ఇంటికి వెళ్లేసరికి తాను భయానకంగా కనిపించింది’’ అని తెలిపాడు.

‘‘గొంతు దగ్గర గాయంతో.. రక్తం మడుగులో నగ్నంగా పడి ఉన్న నయాబ్‌ శరీరం కనిపించింది. ఆ దృశ్యం చూడగానే భయంతో బిగుసుకుపోయాను. ఆ తర్వాత తేరుకుని పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాను. నయాబ్‌ బాత్రూం కిటికి పగిలిపోయి ఉంది. దుండగులు దాని గుండా ఇంట్లో చొరబడి తనను హత్య చేసి ఉంటారు. ఇక తన నగ్న శరీరాన్నీ టీవీ రూంలో పడేశారు’’ అని నసీర్‌ తెలిపాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios