Asianet News TeluguAsianet News Telugu

ఇమ్రాన్ సర్కార్‌కు షాక్: ‘ గ్రే లిస్ట్‌’ లోకి పాకిస్తాన్‌.. ఎఫ్ఏటీఎఫ్ సంచలన నిర్ణయం

పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. దాయాది దేశాన్ని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి పాకిస్తాన్ గ్రే లిస్ట్‌లో ఉంటుంది. 

Pakistan To Stay On Terror Financing "Grey List" Till Feb 2021 ksp
Author
Paris, First Published Oct 23, 2020, 8:36 PM IST

పాకిస్తాన్‌కు షాక్ తగిలింది. దాయాది దేశాన్ని ఫైనాన్షియల్‌ యాక్షన్‌ టాస్క్‌ఫోర్స్‌ గ్రే లిస్ట్‌లో కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి పాకిస్తాన్ గ్రే లిస్ట్‌లో ఉంటుంది.

ఐక్యరాజ్యసమితి నిషేధించిన ఉగ్రవాద సంస్థలకు, అంతర్జాతీయ ఉగ్రవాదులకు పాకిస్తాన్ సురక్షితమైన వాతావరణాన్ని కల్పిస్తోంది. ఉగ్రవాద నిధులను, మనీలాండరింగ్‌ను అరికట్టడంలో పాకిస్తాన్ అసమర్థత కారణంగా 2018 నుండి ఈ జాబితాలో ఉంది.

టర్కీ, చైనా, మలేషియా వంటి దేశాలు పాకిస్తాన్‌కు మద్దతునిస్తూనే ఉన్నాయి. ఈ మద్దతు కారణంగా, పాకిస్తాన్ ముందు రెండుసార్లు FATF బ్లాక్ జాబితాలోకి రాకుండా తప్పించుకుంది.

ఈసారి కూడా ఈ దేశాలు పాకిస్తాన్‌కు మద్దతు ఇచ్చాయని చెబుతున్నారు. బ్లాక్ లిస్ట్ చేయకుండా ఉండటానికి పాకిస్తాన్‌కు 3 ఓట్లు మాత్రమే అవసరం. అదే సమయంలో, గ్రీన్‌ లిస్ట్ నుండి బయటకు రావడానికి 13 ఓట్లు అవసరం.

ఉగ్రవాద నిధులు, మనీలాండరింగ్‌ను ఆపడానికి 27 చర్యలు తీసుకోవాలని పాకిస్థాన్‌ను ఎఫ్‌ఎటిఎఫ్ కోరింది. కానీ పాకిస్తాన్ ఇప్పటివరకు 21 చర్యలు మాత్రమే  తీసుకుంది, 6 అంశాల్లో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మసూద్, హఫీజ్ సయీద్, దావూద్, లఖ్వీ వంటి ఉగ్రవాదులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం కూడా ఇందులో ఉంది.

ఇందులోని నామినేటెడ్ దేశాలైన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు కూడా పాక్ వ్యవహార శైలిపై అసంతృప్తిగా ఉన్నాయని, అఫ్గనిస్థాన్ సహా భారత్ విషయంలో ఆ దేశం వైఖరి పట్ల గుర్రుగా ఉన్నాయన్నారు. ఉగ్రవాదులపై పాక్ సరైన చర్యలు తీసుకోవడంలేదనే అభిప్రాయంతో ఉన్నట్టు తెలుస్తోంది

అసలే పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు ఎఫ్‌ఏటీఎఫ్ గ్రే లిస్ట్‌లో కొనసాగించడంతో మరిన్ని కష్టాలు తప్పవు. పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్‌, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌, యూరోపియన్‌ యూనియన్‌ బ్యాంక్‌ల నుంచి అంత సులువుగా రుణాలు లభించే పరిస్థితి ఉండదు. ఇది ఆ దేశ ఆర్థిక వ్యవస్థకు శరాఘాతంగా మారనుంది.

ఎఫ్ఏటీఎఫ్ ఒక అంతర్జాతీయ సంస్థ, దీనిని జీ7 దేశాల చొరవతో 1989లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ప్యారిస్‌లో ఉంది. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మనీ ల్యాండరింగ్‌ను ఎదుర్కోడానికి ఇది విధానాలు రూపొందిస్తుంది. 2001లో ఇది తీవ్రవాదం, వారికి నిధులు అందించడాన్ని కూడా తన విధానాల్లో చేర్చింది.

అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ సజావుగా ఉండేలా ఇది విధానాలు రూపొందిస్తుంది. వాటిని అమలు చేసే దిశగా పనిచేస్తుంది. ఎఫ్ఏటీఎఫ్‌లో మొత్తం 38 సభ్య దేశాలు ఉన్నాయి. వాటిలో భారత్, అమెరికా, రష్యా, బ్రిటన్, చైనా కూడా ఉన్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios