వార్నీ.. అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ, అడిగితే ‘సెక్స్ దైవిక విధి’ అంటూ సమర్థింపు....
అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తూ పట్టుబడ్డ ఓ నిందితుడు సెక్స్ తాము చేసే దైవిక పని అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాదు అతనికి 20 మంది భార్యలున్నట్టు తేలింది.

అమెరికా : తప్పు చేయడమే కాదు.. దాన్ని సమర్థించుకోవడం తెలిసి ఉండాలి. అప్పుడే తప్పును ఒప్పుగా ధైర్యంగా చేయొచ్చు.. ఇదే బాగా నమ్మాడు ఓ నిందితుడు. అందుకే.. తాము చేసే శృంగార పనులు దైవిక విధి అని.. దాన్ని పూర్తి చేయడమే తమ కర్తవ్యమని’.. ధైర్యంగా బొంకాడు. విషయం ఏంటంటే.. బాలికల అక్రమ రవాణా కేసులో శామ్యూల్ బేట్ మేన్ (46) అనే నిందితుడిని అరిజోనా పోలీసులు పట్టుకున్నారు. వారి విచారణలో శామ్యూల్ ‘వారికి మేము దేవుడు స్ఫూర్తిని అందిస్తున్నాం. నేను, మా అనుచరులు ఆ అమ్మాయిలతో చేస్తున్నసెక్స్… దైవిక విధులను పూర్తిచేయడంలో భాగమే’ అంటూ చెప్పుకొచ్చాడు.
దీంతో షాకైన ఎస్బిఐ అధికారులు.. ఏమి చేసేది లేక .. ఈ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. అరిజోనా రాష్ట్రంలోని కొలరాడో సిటీలో ఉండే శామ్యూల్ అమ్మాయిల అక్రమ రవాణా కేసులో గత ఆగస్టులో పోలీసులకు పట్టుబడ్డాడు. ఫ్లాగ్ స్టాఫ్ పట్టణం మీదినుంచి యువతులను ఓ ట్రక్కులో అక్రమ రవాణా చేస్తుండగా ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత అతడిని విచారించిన పోలీసులకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. అతనికి ఇరవై మంది భార్యలు ఉన్నారని.. అందులో ఎక్కువమంది మైనర్లేనని తెలుసుకుని షాక్ అయ్యారు. శామ్యూల్ అరిజోనా-యూటారాష్ట్రాల సరిహద్దుల్లో ఉంటాడు.
స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు
‘ఫండమెంటల్ లిస్ట్ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ ల్యాటర్ - డే సెయింట్స్’ అనే సమూహంలో మాజీ సభ్యుడు. 130 ఏళ్ల కిందటి దాకా ఈ చర్చి బహుభార్యత్వాన్ని ఓ వారసత్వంగా బోధించేది. అయితే, 1980లో దీన్ని రద్దు చేశారు. ఆ తర్వాత శామ్యూల్ తనను తాను ఓ ప్రవక్తగా చెప్పుకోవడం మొదలు పెట్టాడు. తనకంటూ కొంతమంది అనుచరులను ఏర్పాటు చేసుకున్నాడు. అలా ఓ సమూహానికి నాయకుడిగా మారాడు.
అతని అనుచరుల్లోని అనేకమంది భార్యలు, పిల్లలు సామాన్యులకు భార్యగా మారినట్లు ఎఫ్బీఐ తేల్చింది. తన అఫిడవిట్లో ఈ విషయాలన్నీ పొందుపరిచింది. ఫోరెన్సిక్ ఇంటర్వ్యూల్లో శామ్యూల్ దగ్గర ఉన్న బాలికల్లో ఒక్కరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీంతో ఏఫ్భీఐ ఆశ్చర్య పోయింది. అతడికి భార్యగా ఉన్న ఇతర మహిళలు.. ఈ బాలికలను అతనికి అనుకూలంగా ప్రభావితం చేసి ఉండవచ్చని ఎస్బిఐ అధికారులు అంటున్నారు.
అమ్మాయిలను అమాయకులను చేసి దేవుడి పేరుతో వ్యాపారం చేస్తూ.. భక్తి ముసుగులో తప్పించుకుంటున్న దొంగబాబాలు మనదేశంలోనే కాదే.. ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. కాకపోతే దేవుడి పేరు మార్పు అంతే.