Asianet News TeluguAsianet News Telugu

స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 150 మందికి పైగా గాయాలు

ఓ రైలు స్టేషన్ లో నిలబడి ఉండగా.. వెనకాల నుంచి మరో రైలు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 150 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన స్పెయిన్ లో జరిగింది. 

A terrible train accident in Spain.. More than 150 people were injured
Author
First Published Dec 7, 2022, 4:46 PM IST

స్పెయిల్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బార్సిలోనా సమీపంలో నిలబడి ఉన్న రైలు వెనకాల మరో రైలు వెనకాల భాగం నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 150 మందికి పైగా స్వల్పంగా గాయపడ్డారు. ఈ విషయాన్ని ఎమర్జెన్సీ సర్వీస్, స్పెయిన్‌కు చెందిన రెన్ఫే రైలు ఆపరేటర్ బుధవారం తెలిపారని ‘ఎన్డీటీవీ‘ నివేదించింది. 

గురుద్వారను సందర్శించిన బ్రిటన్ కింగ్ చార్లెస్ III .. గుడ్డుతో దాడి చేసిన వ్యక్తి అరెస్టు

ఈ ప్రమాదంపై సీఈఎం ప్రాంతీయ అత్యవసర సేవల ప్రతినిధి మాట్లాడుతూ.. ఉదయం 8:00 గంటలకు (0700 GMT) సమయంలో ఈ ఘటన జరిగిందని అన్నారు. ఈ ఘర్షణలో గాయపడిన వారిలో ఎక్కువ మందికి స్వల్పంగానే గాయాలయ్యాయని అన్నారు. ఐదుగురుకి మధ్యస్తంగా గాయాలు అయ్యాయని చెప్పారు. 

బార్సిలోనాకు వెళ్లే లైన్‌లో మోంట్‌కాడా ఐ రీక్సాక్-మన్రేసా స్టేషన్‌లో ఉదయం 7:50 గంటలకు రెండు రైళ్ల ఢీకొన్నాయని అన్నారు. ఓ రైలు మరో రైలును వెనకాల నుంచి ఢీకొట్టిందని రాష్ట్ర రైల్ ఆపరేటర్ ప్రతినిధి ఒకరు వార్తా సంస్థ ‘ఏఎఫ్ పీ’తో తెలిపారు. 

బ్రిటీష్ కోర్టులో నీరవ్ మోదీ అప్పగింతపై స్పందించిన భారత్..

ఈ ఘటనతో ఆ ట్రాక్ వెంట రెండు దిశలలో రైలు ట్రాఫిక్ నిలిపివేశారు. ఈ ఘటనకు కారణం ఏంటనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ‘‘ ఈ రైలు ప్రమాదంతో 155 మంది ప్రభావితమయ్యారు. వారిలో 150 మంది స్వల్పంగా గాయపడ్డారు. ఐదుగురు మధ్యస్తంగా గాయపడ్డారు ’’ ఓ ప్రతినిధి ‘ఏఎఫ్ పీ’తో తెలిపారు. బార్సిలోనాకు ఉత్తరాన 10 కిలోమీటర్ల (ఆరు మైళ్లు) దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని, అక్కడికి 18 వైద్య విభాగాలను మోహరించినట్లు అధికారి పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios