తన లైంగిక వాంఛలను తీర్చుకునేందుకు దేవుడి పేరు చెప్పి.. తనను అనుసరిస్తున్న శిష్యురాళ్లపై అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ చర్చి పాస్టర్. వివరాల్లోకి వెళితే... దక్షిణ కొరియాలోని మన్మిన్ సెంట్రల్ చర్చికి ఎక్కువ మంది వస్తూ ఉంటారు..

దీనికి తోడు ఈ చర్చికి అనుబంధంగా ప్రపంచవ్యాప్తంగా 10 వేల బ్రాంచిలు ఉన్నాయి. అందువల్ల ఈ చర్చికి మెగా చర్చి అనే పేరు వచ్చింది. అందువల్ల చర్చి పాస్టర్ జోరాక్ లీని అనుసరించే వారు ఎక్కువ. వారిలో ఎక్కువ మంది మహిళలే.

దీనిని అవకాశంగా తీసుకున్న పాస్టర్.. వారితో తన లైంగిక కోరికలను తీర్చుకుంటున్నాడు. ఇందుకు గాను దైవానుగ్రహం, దైవాదేశమని సూక్తులు వల్లించేవాడు. ఇది నిజమేనని నమ్మిన కొందరు మహిళలు ఆయన చెప్పినట్లు చేసేవారు. లీ బాధితుల్లో చాలామంది 20 ఏళ్ల వయసులోపు వారే.

అతని ప్రవర్తనలో మార్పును గమనించిన ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వాదనల సందర్భంగానూ తనను నమ్మి.. అనుసరించి వారు స్వర్గానికి వెళతారని చెప్పడంతో న్యాయమూర్తి దీనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జోరాక్ లీకి 15 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు.