Asianet News TeluguAsianet News Telugu

అందుబాటులోకి శ్వాస ద్వారా తీసుకునే కోవిడ్ వ్యాక్సిన్‌.. ఆమోదం తెలిపిన చైనా..

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు చైనా సరికొత్త వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ముక్కు ద్వారా పీల్చే కరోనా వ్యాక్సిన్‌ను చైనా ఆమోదం తెలిపింది.

China approves the world first COVID-19 vaccine you inhale
Author
First Published Sep 5, 2022, 12:26 PM IST

ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్‌కు చైనా సరికొత్త వ్యాక్సిన్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ముక్కు ద్వారా పీల్చే కరోనా వ్యాక్సిన్‌ను చైనా ఆమోదం తెలిపింది. టియాన్‌జిన్‌కు చెందిన క్యాన్‌సినో బయోలాజిక్స్ సంస్థ ఈ కోవిడ్ వ్యాక్సిన్‌ను తయారు చేసింది. ఈ వ్యాక్సిన్‌ను సిరంజి ద్వారా కాకుండా ముక్కుతో  పీల్చడం ద్వారా (శ్వాస ద్వారా తీసుకోవడం)  అందించేలా రూపొందించారు. చైనా నేషనల్ మెడికల్ ప్రొడక్ట్స్ అడ్మినిస్ట్రేషన్ బూస్టర్ వ్యాక్సిన్‌గా అత్యవసర వినియోగం కోసం క్యాన్‌సినో Ad5-nCoVని ఆమోదించింది. ఈ మేరకు ఆ కంపెనీ హాంకాంగ్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌కి ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాక్సిన్‌ అత్యవసర వినియోగానికి ఆమోదం లభించగానే.. హాంకాంగ్‌లో ఆ కంపెనీ షేర్లను 14.5య శాతం వరకు పెరిగాయి. 

ఇక, తాజా వ్యాక్సిన్.. క్యాన్‌సినో బయోలాజిక్స్ వన్ షాట్ కోవిడ్ డ్రగ్‌కి కొత్త వెర్షన్. వన్ షాట్ కోవిడ్ వ్యాక్సిన్.. 2020లోనే మానవ పరీక్షలు జరిగాయి. 2021 ఫిబ్రవరిలో విడుదలైన తర్వాత చైనా, మెక్సికో, పాకిస్తాన్, మలేషియా, హంగేరీలలో దీనిని ఉపయోగించారు. ఇది కోవిడ్-19 లక్షణాలను నివారించడంలో 66 శాతం ప్రభావవంతంగా, తీవ్రమైన వ్యాధికి వ్యతిరేకంగా 91 శాతం ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది

అయితే ఇన్హేల్డ్ వెర్షన్ (శ్వాస ద్వారా తీసుకోవడం) సెల్యులార్ రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుందని క్యాన్‌సినో సంస్థ తెలిపిందే. ఇంట్రామస్కులర్ ఇంజెక్షన్ లేకుండా రక్షణను పెంచడానికి శ్లేష్మ రోగనిరోధక శక్తిని ప్రేరేపిస్తుంది పేర్కొంది. 

ఇక, కరోనావైరస్ నుండి రక్షించడానికి నాసికా, వాయుమార్గ కణజాలాలలో ప్రతిరోధకాలను ప్రేరేపించడానికి వ్యాక్సిన్ల యొక్క ఇన్హేల్డ్ వెర్షన్‌లను అభివృద్ధి చేయడానికి  కంపెనీలు చూస్తున్నాయి. ఇన్హేల్డ్ వెర్షన్‌ పూర్తిగా సిరంజి రహితమైనవి. అలాగే స్వీయ-నిర్వహణలో ఉండనున్నాయి. అయితే ఇవి ఆరోగ్య సంరక్షణ వనరులపై ఒత్తిడిని తగ్గించగలవని నమ్ముతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios