వాషింగ్టన్‌: జమ్ముకశ్మీర్ విభజన, ఆర్టికల్‌ 370 రద్దు అంశాలపై పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరుపై అగ్రదేశం అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టికల్ 370ని భారత్‌ రద్దు చేసిన తర్వాత పాకిస్తాన్ వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టింది.  

జమ్ముకశ్మీర్ వ్యవహారంలో ఇరుదేశాల వైఖరిని గమనిస్తున్నామని అమెరికా స్పష్టం చేసింది. భారత్‌తో వాణిజ్యం రద్దు, దౌత్య సంబంధాలను కనిష్ఠ స్థాయికి చేర్చడం, హైకమిషనర్‌ అజయ్‌ బిసారియా బహిష్కరణ వంటి అంశాలపై మెుట్టికాయలు వేసింది.  

జమ్మూకశ్మీర్‌లో పరిపాలన, కేంద్ర పాలిత ప్రాంతాలు వంటి అంశాలపై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గమనిస్తున్నట్లు అమెరికా స్పష్టం చేసింది. ఆయా అంశాల్లో చోటు చేసుకుంటున్న పురోగతులను కూడా గమనిస్తున్నట్లు తెలిపింది.  

అయితే జమ్ముకశ్మీర్ వ్యవహారంలో పాకిస్థాన్‌ తన దూకుడును తగ్గించుకోవాలని అమెరికా సూచించింది. ఎల్‌ఓసీలో అక్రమ చొరబాట్లకు మద్దతివ్వడం పాక్ ఆపేయాలని ఆదేశించింది. పాకిస్థాన్‌ గడ్డమీద ఉగ్రవాద మూలాలపై చర్యలు తీసుకోవాలని అమెరికా సూచించింది.  

ఇకపోతే జమ్మూకశ్మీర్‌ విభజనపై పాక్‌ తీవ్రంగా స్పందించింది. బుధవారం సాయంత్రం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలో జరిగిన జాతీయ భద్రతా కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

భారత్‌తో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు నిలిపివేయాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలోని భారత రాయబారిని బహిష్కరించింది. పాకిస్థాన్‌ హై కమిషనర్‌ను భారత్‌కు పంపరాదని నిర్ణయించింది. ఈ వ్యవహారాలపై అమెరికా సీరియస్ గా స్పందించింది. మరి అమెరికా హెచ్చరికలతో పాక్ ఎలాంటి నిర్ణయం ప్రకటిస్తుందో వేచి చూడాలి. 

ఈ వార్తలు కూడా చదవండి

భారత్ తో వాణిజ్యసంబంధాలు రద్దు: పాక్ ప్రధాని ఇమ్రాన్ సంచలన నిర్ణయం

యుద్దం తప్పదేమో: 370 ఆర్టికల్ రద్దుపై ఇమ్రాన్ సంచలనం

జమ్ముకశ్మీర్ పునర్విభజన బిల్లుకు లోక్ సభ ఆమోదం

పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను స్వాధీనం చేసుకోవడం తెలుసు: అమిత్ షా

ఆర్టికల్ 370 రద్దుపై చైనా దుర్బుద్ధి: వత్తాసు పలికిన పాకిస్తాన్

మరో పుల్వామా దాడి: ఆర్టికల్ 370 రద్దుపై ఇమ్రాన్ ఖాన్ సంచలనం

ఇండియాను చైనాలా, కశ్మీర్ ను పాలస్తీనాలా మారుస్తారా?: ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆగ్రహం

కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తే దేశ ద్రోహులుగా చూస్తున్నారు: నామా

పార్లమెంట్‌లో అబద్దాలు: అమిత్ షా పై ఫరూక్ అబ్దుల్లా

ఆర్టికల్ 370 రద్దు: సుప్రీంకోర్టులో పిటిషన్

కాశ్మీర్ విభజన బిల్లు: లోక్‌సభ నుండి టీఎంసీ వాకౌట్

కాశ్మీర్ విషయంలో భారత్ విజయం... పాక్ కి లభించని మద్దతు

సొంత పార్టీకి షాక్.. కేంద్రం నిర్ణయానికి జైకొట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

రాజ్యాంగ స్పూర్తికి విరుద్దం: జమ్మూ కాశ్మీర్‌ విభజనపై రాహుల్

కాశ్మీర్ విభజన: ఎపి విభజనపై కాంగ్రెస్ కు అమిత్ షా చురకలు

ఆక్రమిత కాశ్మీర్ పై అమిత్ షా సంచలన ప్రకటన

లోక్‌సభలో కాశ్మీర్ విభజన బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా