MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!

US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!

పొట్టోన్ని పొడుగోడు కొడితే పొడుగోన్ని పోచమ్మ కొట్టింది అన్నట్లుగా ఉంది ట్రంప్ టారీఫ్స్ పై అమెరికా సుప్రీంకోర్టు తీర్పు. తనకు నచ్చని దేశాలపై ట్రంప్ ఏడాపెడా టారీఫ్స్ విధిస్తే… అసలు అతడికి ఎక్కడిది ఈ అధికారం అంటూ సుప్రీం ప్రశ్నించింది.  

3 Min read
Author : Arun Kumar P
Published : Feb 20 2026, 09:49 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ట్రంప్ కు బిగ్ షాక్..
Image Credit : ANI

ట్రంప్ కు బిగ్ షాక్..

America tariff : టారీఫ్స్ పేరిట ప్రపంచ దేశాలను భయపెట్టిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు షాక్ తగిలింది. అతడు వివిధ దేశాలపై విధించిన టారీఫ్స్ చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. అధ్యక్ష పదవిని అడ్డుపెట్టుకుని, అత్యవసర అధికారాలను ఉపయోగించి ఇతర దేశాలపై భారీగా టారిఫ్‌లు (సుంకాలు) విధించడం చట్టవిరుద్ధమని అమెరికా అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ ప్రపంచ దేశాలపై విధించిన టారిఫ్స్ పై అమెరికా సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ క్రమంలో తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు బెంచ్ 6-3 తేడాతో సుంకాలకు వ్యతిరేకంగా తీర్పు వెలువరించింది. 'ఇంటర్నేషనల్ ఎమర్జెన్సీ ఎకనామిక్ పవర్స్ యాక్ట్' (IEEPA) చట్టం కింద అధ్యక్షుడికి ఇలా టారిఫ్‌లు విధించే అధికారం లేదని బెంచ్ స్పష్టం చేసింది. జస్టిస్‌లు క్లారెన్స్ థామస్, శామ్యూల్ అలిటో, బ్రెట్ కావానాగ్ మాత్రం ఈ తీర్పుతో విభేదించారు.

26
టారిఫ్‌ల కోసం అత్యవసర చట్టాలు వాడతారా...!
Image Credit : Getty

టారిఫ్‌ల కోసం అత్యవసర చట్టాలు వాడతారా...!

జాతీయ అత్యవసర పరిస్థితుల కోసం ఉద్దేశించిన చట్టాన్ని టారిఫ్‌ల కోసం వాడకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ఒకవేళ కాంగ్రెస్ (అమెరికా పార్లమెంట్) అధ్యక్షుడికి అంత పెద్ద అధికారం ఇవ్వాలనుకుంటే చట్టంలో స్పష్టంగా రాసి ఉండేదని జడ్జీలు అభిప్రాయపడ్డారు. ట్రంప్ విధించిన టారిఫ్‌లు చట్టవిరుద్ధమని కింది కోర్టులు ఇచ్చిన తీర్పులను సుప్రీంకోర్టు సమర్థించింది.

వాణిజ్య విషయాల్లో అధ్యక్షుడి అధికారాలకు ఇది ఒక పెద్ద బ్రేక్ అని నిపుణులు అంటున్నారు. అత్యవసర ఆర్థిక అధికారాలను ప్రపంచ వాణిజ్యాన్ని ప్రభావితం చేసే టారిఫ్‌ల కోసం వాడకూడదని ఈ తీర్పు ఒక స్పష్టమైన గీత గీసింది.

గత నవంబర్‌లో ఈ కేసుపై వాదనలు విన్న న్యాయమూర్తులు ఇప్పుడు తీర్పు వెలువరించారు. భవిష్యత్తులో అధ్యక్షులు ఆర్థిక విధానాల్లో అత్యవసర అధికారాలను ఎలా వాడాలనే దానిపై ఈ తీర్పు ప్రభావం చూపుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Related image1
చైనాకు ట్రంప్ మరో షాక్... ఈసారి ఏకంగా 245% టారీఫ్స్
Related image2
Donald Trump: ట్రంప్ ఏడాది పాల‌న‌లో జరిగింది ఏంటి.? ప్ర‌పంచ వ్యాపారంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డింది
36
వసూలు చేసిన టారిఫ్స్ తిరిగి ఇవ్వాల్సిందేనా..?
Image Credit : X

వసూలు చేసిన టారిఫ్స్ తిరిగి ఇవ్వాల్సిందేనా..?

ట్రంప్ తన హయాంలో దాదాపు అన్ని దేశాలపై అత్యవసర చట్టాన్ని ఉపయోగించి టారిఫ్‌లు విధించారు. అమెరికాకు నష్టం కలిగించే వాణిజ్య పద్ధతులను అవలంబిస్తున్నాయంటూ పలు దేశాలపై 'రెసిప్రోకల్' టారిఫ్‌లు వేశారు. ముఖ్యంగా మెక్సికో, కెనడా, చైనా నుంచి వలసలు, మాధకద్రవ్యాల అక్రమరవాణాను అరికట్టే పేరుతో ప్రత్యేక సుంకాలు విధించారు. ఇక భారత్ రష్యా నుండి ఆయిల్ కొనుగోలు చేస్తోందంటూ భారీ టారీఫ్స్ విధించారు. అయితే ఇటీవల టారీఫ్స్ తగ్గించిన అమెరికా 18 శాతానికి పరిమితం చేసింది… అలాగే భారత్ తో కీలక వాణిజ్య ఒప్పందాలు చేసుకుంది.

అయితే ఇప్పటివరకు టారీఫ్స్ పేరిట వసూలుచేసిన డబ్బులు తిరిగి ఆయా దేశాలకు చెల్లించాలని అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ సర్కార్ కు సూచించింది. అలాగే వెంటనే టారీఫ్స్ సవరించాలని... ఇకపై అధిక పన్నులు వసూలు చేయరాదని సూచించింది.

46
అధ్యక్షుడి అత్యవసర అధికారాలపై కత్తెర
Image Credit : X

అధ్యక్షుడి అత్యవసర అధికారాలపై కత్తెర

కాంగ్రెస్ ఆమోదించిన సాధారణ వాణిజ్య చట్టాల స్థానంలో అత్యవసర ఆర్థిక అధికారాలను ఉపయోగించలేమని కోర్టు నొక్కి చెప్పింది. టారిఫ్‌ల కోసం IEEPA చట్టాన్ని విస్తృతంగా ఉపయోగించడాన్ని తిరస్కరించడం ద్వారా, వాణిజ్య విధానంలో అధ్యక్షుడి అధికారానికి కోర్టు స్పష్టమైన పరిమితిని నిర్దేశించింది.

56
టారిఫ్‌లను సమర్థించుకున్న ట్రంప్
Image Credit : Getty

టారిఫ్‌లను సమర్థించుకున్న ట్రంప్

ఈ తీర్పు రాకముందు అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో జరిగిన ఓ కార్యక్రమంలో ట్రంప్ తన టారిఫ్ విధానాన్ని గట్టిగా సమర్థించుకున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడటానికే టారిఫ్‌లు పెట్టానని, అవి లేకపోతే అందరూ దివాళా తీసేవారని వాదించారు.

అధ్యక్షుడిగా టారిఫ్‌లు విధించే హక్కు తనకు ఉందని, చట్టంలోని పదాలు తన చర్యలకు సపోర్ట్ ఇస్తున్నాయని ఆయన అన్నారు. తీర్పు వెలువరించడానికి కోర్టు చాలా సమయం తీసుకోవడంపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. దాని కోసం తాను చాలా కాలంగా ఎదురుచూస్తున్నానని చెప్పారు.

66
సుప్రీంకోర్టు తీర్పుతో లాభాల్లో అమెరికా స్టాక్ మార్కెట్స్
Image Credit : Meta AI

సుప్రీంకోర్టు తీర్పుతో లాభాల్లో అమెరికా స్టాక్ మార్కెట్స్

అమెరికా సుంకాల భయంతో ప్రపంచదేశాల స్టాక్ మార్కెట్స్ లో చాలాకాలంగా అనిశ్చితి నెలకొంది. అమెరికా స్టాక్ మార్కెట్ పరిస్థితి కూడా ఇలాగే ఉంది. కానీ తాజా సుప్రీం కోర్టు తీర్పు తర్వాత యూఎస్ స్టాక్ మార్కెట్ ఊపందుకుంది.. లాభాలబాట పట్టింది. ఇతర దేశాల స్టాక్ మార్కెట్స్ పై కూడా అమెరికా సుప్రీంకోర్టు ప్రభావం ఉంటుంది. మరి భారత స్టాక్ మార్కెట్స్ ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి.  

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
డొనాల్డ్ ట్రంప్
వ్యాపారం
స్టాక్ మార్కెట్
భారత దేశం
పాకిస్తాన్
చైనా
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ కేబినెట్‌లో హిందూ మంత్రి.. ఎవరీ గయేశ్వర్ చంద్ర రాయ్?
Recommended image2
ప్రపంచంలో అత్యంత రహస్య ప్రదేశాలు.. 24/7 హై సెక్యూరిటీలో ఉంటాయి. ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది?
Recommended image3
ఆట‌గాళ్ల‌కు కండోమ్ స‌మ‌స్య‌.. 3 రోజుల్లోనే 10 వేల స్టాక్ ఖ‌తం. అస‌లేంటీ కండోమ్‌ల గొడ‌వ‌
Related Stories
Recommended image1
చైనాకు ట్రంప్ మరో షాక్... ఈసారి ఏకంగా 245% టారీఫ్స్
Recommended image2
Donald Trump: ట్రంప్ ఏడాది పాల‌న‌లో జరిగింది ఏంటి.? ప్ర‌పంచ వ్యాపారంపై ఎలాంటి ప్ర‌భావం ప‌డింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved