హైదరాబాద్‌లో కిలాడి లేడీని అరెస్ట్ చేశారు సైబర్ క్రైమ్ పోలీసులు. స్కూలు విద్యార్దినులే టార్గెట్‌గా డబ్బు దండుకుంటున్న నేహా అనే మహిళను అదుపులోకి తీసుకున్నారు.

అమ్మాయిల ఫోటోలను న్యూడ్ వెబ్‌సైట్లలో పెట్టి.. వాటిని తొలగిస్తానంటూ బాధితులకే ఫోన్ చేసి డబ్బులు గుంజడంలో ఈమె నేర్పరి. నగరంలోని ప్రముఖ ప్రైవేట్ స్కూళ్ల వెబ్‌సైట్ల నుంచి విద్యార్ధినుల ఫోటోలను డౌన్‌లోడ్ చేసి అశ్లీల వెబ్‌సైట్లలో పెడుతుంది.

అనంతరం అదే పాఠశాలలకు ఫోన్ చేసి తాను సైబర్ సెక్యూరిటీ సెల్ నుంచి మాట్లాడుతున్నానని.. వెబ్‌సైట్లలో ఉన్న విద్యార్ధినుల ఫోటోలను తీసేస్తానని డబ్బులు డిమాండ్ చేస్తుంది.

ఈమె చేతిలో పలువురు మోసపోవడంతో విషయం పోలీసుల దాకా వెళ్లడంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేహా సెల్‌ఫోన్‌లో సుమారు 250 మంది విద్యార్ధినుల ఫోటోలు ఉన్నాయి.