Asianet News TeluguAsianet News Telugu

Anupama Parameswaran: నిర్మాత కొడుకైతే ఇచ్చేస్తావా? అనుపమాకు ట్రోలింగ్

 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యింది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మా.. ఎప్పటికప్పుడు  త‌న ఫోటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకొంది.

Anupama Lip Kiss gets Lots Of Trolling
Author
Hyderabad, First Published Jan 10, 2022, 7:32 AM IST


లిప్ లాక్ కిస్ సీన్స్ ఉంటే సినిమా హిట్ అవుతుందో లేదో కానీ ఓ వర్గానికి మాత్రం అవి తెగ నచ్చుతాయి. కమర్షియల్ సక్సెస్ కు అవి భాక్సాఫీస్ దగ్గర బాగా కిక్ ఇస్తాయి. అయితే సాధారణంగా ఎవరికి పడితే వారికి లిప్ కిస్ తెరపై ఇవ్వటానికి హీరోయిన్స్ ఒప్పుకోరు. స్టార్ హీరో సినిమాలో అడిగితే కాదనలేరు. కానీ ఓ స్టార్ ప్రొడ్యూసర్ కొడుకు లాంచ్ అయ్యే సినిమాలో అడిగితే కాదనదేముంది..అలా ఇచ్చిన అనుపమా పరమేశ్వరన్ లిప్ లాక్ కిస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రోలింగ్ కు గురి అవుతోంది.

 అనుపమ పరమేశ్వరన్ మలయాళ 'ప్రేమమ్' సినిమాతో ఎంత పాపులర్ అయ్యింది. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మా.. ఎప్పటికప్పుడు  త‌న ఫోటోల‌ను ఫ్యాన్స్‌తో పంచుకొంది.సోష‌ల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే అనుప‌మ త‌న‌దైన స్టైల్ ఫాన్స్‌కు ద‌గ్గ‌ర‌గా ఉండేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. అయితే అదే సోషల్ మీడియాలో ఈ లిప్ లాక్ కిస్ తో ఆమెకు ట్రోలింగ్ మొదలైంది. ఎంత రెమ్యునేషన్ ఇస్తే మాత్రం ఇలా కొత్త కుర్రాళ్లకు లిప్ లాక్ ఇచ్చేస్తావా అని కొందరు అంటున్నారు. మరికొందరు..లిప్ లాక్ ఇవ్వటానికి ఓ స్దాయి ఉండాలనేది చూసుకోవా అని నిలదీస్తున్నారు. ఇంకొందరైతే మా హీరోకు కూడా ఇవ్వాల్సిందే నెక్ట్స్ సినిమాలో అంటూ స్వీట్ వార్నింగ్ లు ఇస్తున్నారు. అంతా ఆమె పై అభిమానంతోనే అని అర్దమవుతోంది.

 

అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం   దిల్ రాజు బ్యానర్‌లో రౌడీ బాయ్స్ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాతో దిల్ రాజు వారసుడు ఆశిష్ రెడ్డి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాను శ్రీ హర్ష కన్నెగంటి తెరకెక్కిస్తున్నాడు. ఇందులో అమ్మడు ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఈ సినిమా కోసం లిప్ లాక్ సీన్స్ కూడా చేసింది అనుపమ. ఇప్పటి వరకు చాలా పద్దతిగా కనిపించిన అనుపమ.. మొదటి సారి ఈ సినిమా కోసం రెచ్చిపోవటంతో హాట్ టాపిక్ గా మారింది . రౌడీ బాయ్స్ సినిమాలో ఏకంగా 5 లిప్ లాక్ సీన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల కానుంది ఈ చిత్రం. తాజాగా విడుదలైన ట్రైలర్‌లోనే లిప్ లాక్ తో ప్రమోట్ చేస్తున్నారు నిర్మాతలు. 

నిర్మాత దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్‌’ ప‌క్కా యూత్ కంటెంట్ మూవీ. ఆల్ రెడీ రౌడీ బాయ్స్ టైటిల్ ట్రాక్‌, ప్రేమే ఆకాశ‌మైతే అనే పాట‌లు విడుద‌లై మంచి రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకున్నాయి. అలాగే టీజ‌ర్‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది.  కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. ఇందులో ల‌వ్ కంటెంట్ ఎలా ఉంటుంద‌నేది సినిమా చూడాల్సిందే. యూత్‌ఫుల్ మూవీ కావ‌డంతో దీనికి రౌడీ బాయ్స్ అనే టైటిల్ పెట్టాం. సంక్రాంతి సంద‌ర్భంగా ‘రౌడీ బాయ్స్’ను విడుద‌ల చేస్తున్నాం. డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష మంచి టీమ్‌తో యూత్ సహా అందరకీ నచ్చే ఓ ఎంటర్‌టైనింగ్ సినిమాను రూపొందించాడు. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ పెద్ద ఎసెట్ అవుతుందనడంలో సందేహం లేదు. దేవిశ్రీ మ్యూజిక్ ఇచ్చిన ఈ సినిమాలో పాటలకు వచ్చిన రెస్పాన్సే అందుకు ఎగ్జాంపుల్.  అనుప‌మ మా బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌ను కొత్త అమ్మాయిలా ఒదిగిపోయి యాక్ట్ చేసింది. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. అన్నీ ఎలిమెంట్స్‌తో రౌడీ బాయ్స్ యూత్‌ని మెప్పిస్తుంది’’ అన్నారు.

Also Read :Samantha : విలన్ గానే బాగుందట.. మరోసారి నెగిటివ్ క్యారెక్టర్ లో సమంత

Follow Us:
Download App:
  • android
  • ios