చపాతీ పిండితో ఫేస్ ప్యాక్.. ముఖం మెరిసిపోతుంది..!
గోధుమ పిండి తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే.. ముఖంపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది. మరి ఈ పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ఇప్పటి వరకు మనకు గోధుమ పిండితో చపాతీ, రోటీ, పుల్కాలు మాత్రమే చేసుకోవడం మాత్రమే తెలుసు. ఆరోగ్యంగా ఉండేందుకు.. బరువు కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఈ చపాతీలను మనం తింటూ ఉంటాం. కానీ.. ఇప్పుడు అదే గోధుమ పిండితో.. అందాన్ని కూడా పెంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నమ్మసక్యంగా లేకపోయినా ఇదే నిజం. గోధుమ పిండితో ఫేస్ ప్యాక్ చేసుకుంటే... అందంగా మెరిసిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదెలాగో ఇప్పుడు చూద్దాం...
గోధుమ పిండి తో ఫేస్ ప్యాక్ చేసుకుంటే.. ముఖంపై ఉన్న ట్యాన్ తొలగిపోతుంది. మరి ఈ పేస్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
ముందుగా రెండు స్పూన్ల గోధుమ పిండిని తీసుకోవాలి. దాంట్లో ఒక టీస్పూన్ తేనె కలపాలి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ ఉంటాయి
పై మిశ్రమంలో ఒక స్పూన్ పెరుగు కూడా కలపాలి. పెరుగులో బ్లీచింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ట్యాన్ సులభంగా పోతుంది.
ఈ మిశ్రమంలోనే కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలపాలి. ఇది స్కిన్ పిగ్మెంటేషన్ లైటెనింగ్ చేయడానికి సహాయం చేస్తుంది.
దీంట్లో ఒక స్పూన్ ఓట్స్ కూడా కలపాలి. ఆ తర్వాత కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. ఇది డెడ్ స్కిన్ సెల్స్ ని చంపేస్తుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం కలిపి ముఖానికి రాసుకోవాలి. అది ఎండిపోయేంత వరకు రుద్దుతూనే ఉండాలి. ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే.. ముఖం మెరిసిపోతుంది. ట్యాన్ కూడా తొలగిపోతుంది.