ఫేవరేట్ సెక్స్ పొజిషన్ చెప్పి షాకిచ్చిన మలైకా అరోరా
నేహా దూపియాకు సంబంధించిన టీవీ షోలో మలైకా తన బెడ్రూమ్ సీక్రెట్స్ కూడా బయటపెట్టడం గమనార్హం.
బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె అందానికీ, ఫిట్నెస్ కి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఆమె వయసు ఐదు పదులకు చేరువలో ఉన్నా.. ఏ మాత్రం చెక్కు చెదరకుండా.. ఇప్పటికీ అందంగా కనిపిస్తూ ఉంటారు.
ఈ 47ఏళ్ల బ్యూటీ తాజాగా.. తన లైఫ్ లోని సీక్రెట్స్ బయటపెట్టారు. ఇటీవల ఆమె ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలు వెల్లడించారు.
తనకు రాత్రిపూట ఆటలు ఆడటం అంటే ఇష్టమని.. గడ్డం ఉండే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతానని ఆమె చెప్పడం విశేషం.
నేహా దూపియాకు సంబంధించిన టీవీ షోలో మలైకా తన బెడ్రూమ్ సీక్రెట్స్ కూడా బయటపెట్టడం గమనార్హం.
నేహా దూపియా.. తన షోకి వచ్చిన ప్రతి ఒక్కరినీ కామన్ గా అడిగే ప్రశ్న.. ‘ మీకు నచ్చిన సెక్స్ పొజిషన్ ఏంటి’ అని.. ఇదే ప్రశ్నను ఆమె మలైకా ముందు కూడా ఉంచింది.
కాగా.. తనకు ‘ఆన్ టాప్’ సెక్స్ పొజిషన్ ఇష్టమంటూ మలైకా సమాధానం ఇవ్వడం గమనార్హం.
నేహా ప్రశ్న అడగగానే.. ఓ నవ్వు నవ్వి.. తనకు టాప్ లో ఉండటం ఇష్టమంటూ సమాధానం చెప్పింది. అది విని అందరూ షాకైనా ఆమె ఫ్రాంక్ నెస్ ని అభిమానులు కూడా ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో మలైకా తన అందం, ఫిట్నెస్ తో మాత్రమే సోషల్ మీడియాలో కనిపించేవారు.. అయితే.. ఎప్పుడైతే బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తో ఆమె ఎఫైర్ పెట్టుకుందో.. అప్పటి నుంచి ఆమె హాట్ టాపిక్ గా మారారు.
పార్టీలు, బీచ్ లు, హాలీడే ట్రిప్ లకు కలిసి తిరుగతూ.. ఇప్పటికే చాలా సార్లు అర్జున్, మలైకా మీడియాకు చిక్కారు. త్వరలోనే వారు పెళ్లి కూడా చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది.