Hair Care: డెలివరీ తర్వాత జట్టు రాలిపోతోందా..? ఇదిగో పరిష్కారం..!
డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు విపరీతంగా జట్టు ఊడిపోతుందని కంప్లైంట్ చేస్తున్నారు. గతంలో చాలా ఒత్తుగా ఉండే జుట్టు.. ఇప్పుడు.. కుప్పలు కుప్పలుగా ఊడి పోయి పీచులాగా మారుతుంది.
పెళ్లైన స్త్రీ.. తల్లి కావడం ఓ వరంగా భావిస్తుంది. 9 నెలలు మోసి కన్న బిడ్డను చూసి మురిసిపోతుంది. బిడ్డను ఒక్కసారి చేతుల్లోకి తీసుకున్న తర్వాత.. డెలివరీ సమయంలో పడిన నొప్పులన్నింటినీ పూర్తిగా మర్చిపోతుంది. అప్పటి నుంచి తన బిడ్డను అపురూపంగా చూసుకుంటుంది.
Mental health due to hair loss It also affects!
అయితే.. ఈ మధ్య డెలివరీ తర్వాత చాలా మంది స్త్రీలు కామన్ గా ఓ సమస్యను ఎదుర్కొంటున్నారు. అదేంటో తెలుసా..? జుట్టు రాలడం. డెలివరీ తర్వాత చాలా మంది మహిళలు విపరీతంగా జట్టు ఊడిపోతుందని కంప్లైంట్ చేస్తున్నారు. గతంలో చాలా ఒత్తుగా ఉండే జుట్టు.. ఇప్పుడు.. కుప్పలు కుప్పలుగా ఊడి పోయి పీచులాగా మారుతుంది. జుట్టు మొత్తం పలచగా మారడం మొదలౌతుంది.
అయితే. మనం కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల.. మీ బిడ్డకు సంవత్సరం తిరిగి వచ్చేలాగా..మళ్లీ మీ జుట్టుతిరిగి పోగలరు. అయితే.. దానికల్లా.. మీరు సమతుల్యమైన, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటే జుట్టు రాలే సమస్యకు పరిష్కారం చెప్పవచ్చట. అంతేకాకుండా..ఈ కింది చిట్కాలు ఫాలో అవ్వాలని నిపుణులు చెబుతున్నారు.
ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారం తీసుకోవాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. ఇది తర్వాత జుట్టు పెరగడానికి సహాయపడుతుంది
వాల్యూమైజింగ్ షాంపూని ఉపయోగించండి- వీటిలో ప్రొటీన్ వంటి పదార్థాలు ఉంటాయి, ఇవి జుట్టు మళ్లీ పెరిగేలా సహాయపడుతుంది.
వెంట్రుకలను బరువుగా తగ్గించి, నిండుగా కనిపించేలా చేసే భారీ కండీషనర్‌లను ఉపయోగించడం మానుకోండి.
Hair loss
కొత్త కేశాలంకరణను ప్రయత్నించండి. చాలామంది కొత్త తల్లులు చిన్న జుట్టును ఇష్టపడతారు. చిన్న స్టైల్ జుట్టు నిండుగా కనిపించేలా చేస్తుంది.పొట్టి జుట్టును కూడా సులభంగా నిర్వహించవచ్చు, ఇది సమయాన్ని ఆదా చేస్తుంది.
hair
మీ జుట్టును చాలా గట్టిగా కట్టుకోవద్దు. రబ్బర్ పోనీటైల్ హోల్డర్స్ వంటి బిగుతుగా ఉండే జుట్టు ఉపకరణాలను ఉపయోగించవద్దు
hair loss
జుట్టు క్లిప్‌లు లాంటివి అసలు ఉపయోగించకూడదు. అలాగే, జుట్టు సులభంగా రాలిపోయేలా చేసే చాలా టైట్ పోనీటెయిల్‌లను నివారించండి.
మీ జుట్టు సన్నబడటం కొనసాగితే లేదా తిరిగి పెరుగుతున్నట్లు కనిపించకపోతే, మీరు సంబంధిత వైద్యుడిని సంప్రదించాలి.
థైరాయిడ్ పరిస్థితి, విటమిన్ డి లేదా విటమిన్ బి12 లోపం లాంటివి ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసుకోవడం అవసరం. దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ తీసుకుంటే.. జుట్టు రాలిపోవడం సమస్య నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది.