చెమట వాసన పొగొట్టేందుకు డియోడ్రెంట్... ఏ సమయంలో వాడాలో తెలుసా?
చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో డియోడ్రెంట్స్ రాసుకుంటారు. అయితే.. నిజానికి రాత్రిపూట డియోడ్రెంట్స్ రాసుకోవాలట
ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎంత శుభ్రంగా స్నానం చేసినా కాసేపటికే చెమటలు పట్టేస్తాయి. అలా అని ఊరికూరికే స్నానం చేయలేము కదా.. అందుకే అందరూ డియోడ్రెంట్ వైపు లుక్కేస్తారు. డియోడ్రెంట్స్.. మన శరీరం నుంచి చెమట వాసన రాకుండా చూసుకుంటాయి. అయితే.. మనకు తెలీకుండానే డియోడ్రెంట్ వాడే విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. అవేంటో ఓసారి చూస్తే..
చాలా మంది ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో డియోడ్రెంట్స్ రాసుకుంటారు. అయితే.. నిజానికి రాత్రిపూట డియోడ్రెంట్స్ రాసుకోవాలట. అప్పుడే అవి ఎఫెక్టివ్ గా పనిచేస్తాయట. ఇవి కాకుండా డియోడ్రెంట్స్ వాడే విషయంలో చేయకూడనవీ.. చేయాల్సిన పనులేంటో ఓసారి చూద్దాం..
డియోడ్రెంట్ ని మృదువుగా అప్లై చేయాలి.. చెమట వాసన వచ్చే ప్రదేశాల్లో ఈ డియోడ్రెంట్ ని మృదువుగా అప్లై చేయాల్సి ఉంటుంది. దానిని అలా చేయడం వల్ల ఆ వాసన దుర్గందాన్ని బయటకు రాకుండా తాజా భావన కలిగేలా చేస్తుంది.
చాలా మంది డియోడ్రెంట్స్ ని అండర్ ఆర్మ్స్ లో మాత్రమే వాడతారు. అయితే వీటిని.. మోకాలి కింది భాగాల్లో.. ఇతర చెమటలు పెట్టే ప్రాంతాల్లో కూడా రాసుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
చాలా మంది అండర్ ఆర్మ్స్ శుభ్రం చేసుకున్న వెంటనే డియోడ్రెంట్ ని రాస్తుంటారు. దాని వల్ల దురద, మంట లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. అలా కాకుండా.. కొద్ది గంటల తర్వాత రాసుకుంటే మంచిది.
చాలా మంది అండర్ ఆర్మ్స్ శుభ్రం చేసుకున్న వెంటనే డియోడ్రెంట్ ని రాస్తుంటారు. దాని వల్ల దురద, మంట లాంటివి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. అలా కాకుండా.. కొద్ది గంటల తర్వాత రాసుకుంటే మంచిది.
శరీరం నుంచి చెమట ఎక్కువగా రాకుండా ఉండాలంటే.. రాత్రి పడుకునే ముందు డియోడ్రెంట్ రాసుకోవాలట.