MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Business
  • Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా

Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌ను దెబ్బకొడుతూ జియో కొత్త ఫ్రీడమ్ ప్లాన్..అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్, ఫ్రీ OTT కూడా

Jio Freedom Plan: ఎయిర్‌టెల్‌కు జియో షాకిచ్చింది. కస్టమర్ల కోసం ఫ్రీడమ్ ప్లాన్ తీసుకొచ్చింది. 100Mbps వేగంతో బ్రాడ్ బ్యాండ్, స్థిరమైన కనెక్టివిటీతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంల సబ్ స్క్రిప్షన్ కూడా ఎక్స్ ట్రా ఛార్జీ లేకుడా అందుబాటులో ఉంటాయి. 

2 Min read
Author : Nandini Arava
Published : Jul 25 2026, 06:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తెచ్చిన జియో
Image Credit : chatgpt

కొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను తెచ్చిన జియో

ఎయిర్‌టెల్‌కు జియో గట్టి షాకిచ్చింది. కస్టమర్ల కోసం ఫ్రీడమ్ ప్లాన్ తీసుకొచ్చింది. 100Mbps వేగంతో బ్రాడ్ బ్యాండ్, స్థిరమైన కనెక్టివిటీతో పాటు ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాంల సబ్ స్క్రిప్షన్ కూడా ఎక్స్ ట్రా ఛార్జీ లేకుడా అందుబాటులో ఉంటాయి. 
ఇండియాలో నంబర్ 1 టెలికాం కంపెనీ అయిన రిలయన్స్ జియో, ఎప్పటికప్పుడు కొత్త రీఛార్జ్ ప్లాన్‌లను తెస్తూనే ఉంటుంది. ఇలా కొత్త కస్టమర్లను ఆకర్షిస్తూ, పాతవారిని నిలుపుకుంటోంది. ఇప్పుడు, జియో తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్ల కోసం 'ఫ్రీడమ్ ప్లాన్' అనే కొత్త ప్లాన్‌ను పరిచయం చేసింది. ఈ ప్లాన్‌లో యూజర్లు 100Mbps వేగంతో డేటాను డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ప్లాన్ వాలిడిటీ ముగిసే వరకు అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎన్నో ఓటీటీ యాప్స్ ఉచితం
Image Credit : Gemini AI

ఎన్నో ఓటీటీ యాప్స్ ఉచితం

ఈ ప్లాన్‌లో యూజర్లకు ఇంటర్నెట్‌తో పాటు టీవీ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా లభిస్తుంది. జియోటీవీతో పాటు ఎన్నో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లకు యాక్సెస్ పొందొచ్చు. JioHotstar, SonyLIV, Zee5, Sun NXT, Hoichoi, Discovery+, TimesPlay, ShemarooMe వంటి యాప్స్ ఈ ప్యాక్‌లో ఉన్నాయి.ఓటీటీ యాప్స్‌తో పాటు, జియో సెట్-టాప్ బాక్స్ ద్వారా 800కు పైగా డిజిటల్ లైవ్ టీవీ ఛానెళ్లను చూసే సౌకర్యం కూడా ఈ ప్లాన్‌లో ఉంది.JioHotstar, SonyLIV వంటి టాప్ యాప్స్‌తో పాటు FanCode (స్పోర్ట్స్ లైవ్), జియో సొంత మూవీ ప్లాట్‌ఫామ్ JioCinema Premium యాక్సెస్ కూడా లభిస్తుంది.12 నెలల ఫీజు చెల్లించి 15 నెలల వాలిడిటీ పొందవచ్చు. అంటే, కస్టమర్లకు 3 నెలల అదనపు వాలిడిటీ ఉచితంగా వస్తుంది.

Related Articles

Related image1
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Related image2
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
34
ఈ ప్లాన్ ఎవరికి లాభం?
Image Credit : ‍X

ఈ ప్లాన్ ఎవరికి లాభం?

ఈ ఫ్రీడమ్ ప్లాన్ తీసుకున్న యూజర్లకు జియో ఒక సెట్-టాప్ బాక్స్‌ను ఇస్తుంది. మీరు ఎక్కువ ఇంటర్నెట్ వాడేవారైతే, ఆన్‌లైన్‌లో కంటెంట్ క్రియేట్ చేసేవారైతే, లేదా ఇంటి నుంచి పనిచేసే (Work From Home) వారైతే, ఈ ఫ్రీడమ్ ప్లాన్ ఒక మంచి ఆప్షన్.ఈ కొత్త ప్లాన్‌ను JioFiber, Jio AirFiber యూజర్ల కోసం అందిస్తున్నారు. కస్టమర్లు జియో అధికారిక వెబ్‌సైట్ లేదా MyJio యాప్ ద్వారా దీన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 15 నెలల వాలిడిటీతో వస్తుంది, దీని ధర రూ.10,000గా నిర్ణయించారు.ఈ ప్లాన్ అసలు ధర రూ.10,000 అయినప్పటికీ, దీనికి 18% జీఎస్టీ కలుపుకుంటే మొత్తం సుమారు రూ.11,800 అవుతుంది. కొత్త కస్టమర్లకు జియో ఎయిర్‌ఫైబర్ లేదా జియోఫైబర్ కనెక్షన్ కోసం ఇన్‌స్టాలేషన్ ఫీజు (రూ.1,000) మాఫీ చేస్తారో లేదో చెక్ చేసుకోవాలి.
44
ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ
Image Credit : X

ఎయిర్‌టెల్‌కు గట్టి పోటీ

జియో తెచ్చిన ఈ కొత్త ఫ్రీడమ్ ప్లాన్, భారతీ ఎయిర్‌టెల్ కంపెనీకి పెద్ద షాక్ ఇచ్చింది. ఎయిర్‌టెల్ తన కస్టమర్లకు రూ.499 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లో కేవలం 40mbps వేగంతో మాత్రమే ఇంటర్నెట్ అందిస్తోంది. ఈ ప్లాన్ వాలిడిటీ ఒక నెల మాత్రమే. జియో స్పీడ్ ఎక్కువగా ఉండటంతో, ఎయిర్‌టెల్‌కు ఈ కొత్త ప్లాన్ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Indian Railway: రాత్రుళ్లు ఎవ‌రైనా రైల్వే ట్రాక్‌ను క‌ట్ చేస్తే ఎలా తెలుస్తుంది.?
Recommended image2
Onion Price : తెలుగోళ్లూ రెడీగా ఉండండి.. బస్తాల కొద్దీ ఉల్లిపాయలు కొనే టైమొచ్చింది, మిస్ అయ్యారో అంతే సంగతి
Recommended image3
USA: కారు దిగకుండానే డబ్బులు డ్రా చేసుకోవచ్చు.. అమెరికాలో డ్రైవ్ త్రూ ATM గురించి మీకు తెలుసా?
Related Stories
Recommended image1
jyotika: సోషల్ మీడియాలో జ్యోతిక బోల్డ్ స్టేట్ మెంట్ వైరల్... అభిజీత్ దిప్కేకు సపోర్ట్ చేస్తూ పోస్ట్
Recommended image2
Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. విద్రోహ శక్తులకు అవకాశం ఇవ్వకూడదనే అంటూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved