సెక్స్ తర్వాత ఈ పనులు అస్సలు చేయకూడదు
మీ ఆరోగ్యం బాగుండాలంటే.. సంభోగం తర్వాత మీరు చేయవలసిన కొన్ని పనులు ఉన్నప్పటికీ.. చేయకూడని పనులు కూడా ఉన్నాయి. అవేంటంటే?
సెక్స్ తర్వాత చాలా మంది చేసే కొన్ని సాధారణ తప్పులు ఉన్నాయి. ఈ తప్పులు చేయడం వల్ల అంటువ్యాధులొచ్చే ప్రమాదం పెరుగుతుంది. కానీ అందుకే సెక్స్ ను ఆస్వాధించాలనుకుంటే మీరు సెక్స్ తర్వాత కొన్ని పనులను అస్సలు చేయకూడదు. అవేంటంటే?
టైట్ దుస్తులు
సెక్స్ లో పాల్గొన్న తర్వాత మీ శరీరం బాగా వేడెక్కుతుంది. అలాగే చెమట కూడా బాగా పడుతుంది. ఒకవేళ మీరు సెక్స్ తర్వాత నైలాన్ లేదా సింథటిక్ లోదుస్తులను వేసుకుంటే అది రాపిడీ కలిగించొచ్చు. అలాగే ఆ నైలాన్ దుస్తులు యోని దురదకు దారితీస్తాయి.
sex life
ఇంటిమేట్ వాష్ తో కడగొద్దు
నిపుణుల ప్రకారం.. మీరు సెక్స్ తర్వాత యోనిని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అయినప్పటికీ మీరు కఠినమైన ఇంటిమేట్ వాష్ లను ఉపయోగించకూడదు. ఎందుకంటే సెక్స్ తర్వాత చర్మం చాలా సున్నితంగా మారుతుంది. అందుకే ఇలాంటి పరిస్థితిలో ముఖ్యంగా సెక్స్ తర్వాత డౌచింగ్ కు దూరంగా ఉండాలి.
Image: Getty Images
ఇంటిమేట్ వైప్స్ ఉపయోగించొద్దు
చాలా ఇంటిమేట్ వైప్స్ కృత్రిమ సువాసనలు, సంరక్షణకారులతో నిండి ఉంటాయి. వీటిని ఉపయోగించడం వల్ల అంటువ్యాధులు, దద్దుర్లు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.
Image: Getty Images
సెక్స్ బొమ్మలను శుభ్రం చేయడం
సెక్స్ బొమ్మలకు వీర్యం లేదా యోని ఉత్సర్గ అంటుకుంటాయి. అందుకే వీటిలో బ్యాక్టీరియా పేరుకుపోయే అవకాశం ఉంది. అంటే సెక్స్ తర్వాత వాటిని శుభ్రం చేయకపోతే ఇన్ఫెక్షన్ కు దారితీస్తుంది.
చేతులు కడుక్కోవాలి
సెక్స్ సమయంలో భాగస్వామి జననేంద్రియాలను తాకే అవకాశం ఉంది. ఇక మీ చేతులను శుభ్రం చేసుకోకుండా జననేంద్రియలను తాకితే బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. అలాగే జననేంద్రియాలను తాకడం వల్ల చేతులకు ఎన్నో రకాల బ్యాక్టీరియాలు, యోని ఉత్సర్గ, వీర్యం అంటుకుంటాయి. చేతులను కడుక్కోకుండా ఉంటే ఎన్నో రకాల బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతారు.
వేడినీటి స్నానం మానుకోండి
వేడి నీటి స్నానం శరీరాన్ని రిలాక్స్ చేస్తుంది. అందుకే సెక్స్ లో పాల్గొన్న తర్వాత చాలా మంది వేడినీటితో స్నానం చేస్తుంటారు. కానీ వేడినీటి స్నానం సంక్రమణ వచ్చే అవకాశాలను పెంచుతుంది. వేడి నీటి స్నానం బ్యాక్టీరియాను పెంచడానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను అందిస్తుంది. అందుకే ఈ పని మాత్రం చేయకండి.