పుష్ప 2: మలయాళ అభిమానులకు బన్నీ సర్‌ప్రైజ్ గిప్ట్!
డిసెంబర్ 5న విడుదల కానున్న పుష్ప 2 చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నార్త్ బెల్ట్‌లో మొదటి రోజు వసూళ్లపై ట్రేడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మలయాళ అభిమానుల కోసం ఒక ప్రత్యేక పాటను చిత్రంలో చేర్చారు.
Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI
భారీ ఎక్సపెక్టేషన్స్ నడుమ డిసెంబరు 5న బాక్సాఫీసు ముందుకు రాబోతున్న చిత్రం ‘పుష్ప 2’ (Pushpa 2). ఈ నేపధ్యంలో ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంత రావచ్చు..మొదట రోజు ఓపినింగ్స్ ఎలా వస్తాయనే అంచనాలు , లెక్కలు అప్పుడే మొదలైపోయాయి.
మరీ ముఖ్యంగా నార్త్ బెల్ట్ లో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసే అవకాసం ఉందనే విషయమై డిస్కషన్స్ మొదలయ్యాయి. టోటల్ గా ఎంత కలెక్ట్ చేయచ్చు అనే ట్రేడ్ లెక్కలు,అంచనాలు వేస్తోంది మీడియా. ఇక అంతా నార్త్, తెలుగు రాష్ట్రాలే మాట్లాడుతున్నారు కానీ బన్నీ కు మంచి మార్కెట్ మళయాళం. అక్కడ అతనికి వీరాభిమానులు ఉన్నారు. అక్కడా పుష్ప2 భారీగా రిలీజ్ అవుతోంది. అల్లు అర్జున్ సైతం కేరళ మార్కెట్ పై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
Allu Arjun, #Pushpa2, sukumar, #kALKI
పుష్ప 1 చిత్రం కేరళలో పెద్ద హిట్ అయ్యింది. అదే సమంలో మల్లూ ఫ్యాన్స్ అంటే బన్నీకి కూడా స్పెషల్ ఎఫెక్షన్ చూపెడుతూంటాడు. ఈ క్రమంలో మళాయళి ఫ్యాన్స్ కోసం ఇప్పుడు సర్పైజ్ గిప్ట్ లాంటిది ఏర్పాటు చేసారు.
పుష్ప 2లో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఈ పాట పూర్తిగా మలయాళంలోనే ఉంటుంది. పుష్పని ఆరు భాషల్లో విడుదల చేస్తున్నారు. ప్రతీ భాషలోనూ మలయాళం వెర్షనే ఉంటుంది. అది.. బన్నీకి మలయాళ అభిమానులకు ఇస్తున్న కానుక అని చెప్తున్నారు.
`ఫీలింగ్స్` పేరుతో సంగీత దర్శకుడు దేవిశ్రీ కంపోజ్ చేసిన ఈ పాట.. మాస్‌కు బాగా ఎక్కుతుందని తెలుస్తోంది. ఈ పాటలో బన్నీ, రష్మిక వేసే స్టెప్పులు కూడా స్పెషల్ గా ఉండబోతున్నాయంటున్నారు ఈ విషయాన్ని కేరళ ఈవెంట్ లో అల్లు అర్జున్ స్వయంగా చెప్పాడు.
పుష్ప 1లో స్టెప్పులు వేసే అవకాశం పెద్దగా రాలేదని, వింటేజ్ బన్నీని మిస్ అవుతున్నాం అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారని, అందుకే ఫీలింగ్స్ పాటలో స్టెప్పులు వేసి ఆ కొరత తీర్చామని అంటున్నాడు బన్నీ. ఈ పాటలో అల్లు అర్జున్ స్టెప్పులు కంటే…. రష్మిక వేసిన స్టెప్పులే సెంట్రాఫ్ అట్రాక్షన్ గా ఉండబోతున్నాయట.
ఇదిలా ఉంటే తాజాగా ఈ పాన్ ఇండియా మూవీ పుష్ప 2 సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ సినిమా నిడివి 3: 18గంటలు ఉన్నట్లు సమాచారం . రన్‌టైమ్ ఎక్కువ ఉన్నా సినిమా మంచి విజయాన్ని అందుకోవచ్చని ‘పుష్ప’ పార్ట్ 1 నిరూపించింది.
ఆ మూవీ రన్‌టైమ్ దాదాపు 3 గంటలు. దీంతో, పార్ట్ 2 నిడివి పార్ట్ 1 కంటే కాస్త పెరిగినా ప్రేక్షకులు ఆస్వాదించగలరని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మరో సినిమా ప్రచారంలో భాగంగా బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న నిర్మాత నవీన్ యెర్నేని సైతం ‘పుష్ప 2’ రన్‌టైమ్‌పై ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు. లెంగ్త్ ఎంత ఉన్నా ఇబ్బందేం లేదని, సినిమా చూశాక అసలు దాని గురించే మాట్లాడుకోరని అన్నారు.
Allu Arjun, #Pushpa2, sukumar
పుష్ప 2 లో ప్రతీ నిముషం తల తిప్పనివ్వని విధంగా ఉండబోతోందని టాక్. అదిరిపోయే యాక్షన్ సిక్వెన్స్ లు, స్క్రీన్ ప్లే , ఇంటర్వెల్ బ్యాంగ్ , కథ , కథనం అంతా చాలా ఎంగేజింగ్ గా సుకుమార్ రెడీ చేసారని, అదే ధైర్యంతో రన్ టైమ్ ని లాక్ చేసి వదులుతున్నట్లు వినిపిస్తోంది. ఇక పుష్ప పార్ట్ 1.. 2 గంటల 59 నిమిషాల నిడివితో వచ్చి.. బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము రేపింది. పుష్ప 2 మీద ఎక్సపెక్టేషన్స్ బాగానే పెరిగాయి.
పుష్ప 2 విడుదలకు ముందు రికార్డులివీ..
‘పుష్ప 2’ ఇప్పటికే పలు రికార్డులు నెలకొల్పింది. ఓవర్సీస్‌లో అత్యంత వేగంగా 50 వేలకుపైగా టికెట్స్ సేల్ అయిన చిత్రమిది. ఈ సినిమా ట్రైలర్ 150 మిలియన్‌కి పైగా వ్యూస్, 3 మిలియన్‌కి పైగా లైక్స్ సాధించింది. విడుదలైన 15 గంటలలోపు 40 మిలియన్ల వీక్షణలు పొందిన ఫస్ట్ సౌతిండియా మూవీ ట్రైలర్‌గా ఇది నిలిచిన సంగతి తెలిసిందే.
పట్నాలో నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను, తమ అభిమాన నటుడిని ప్రత్యక్షంగా చూసేందుకు రెండున్నర లక్షకుపైగా అభిమానులు వెళ్లడం గమనార్హం. ఆన్‌లైన్‌లోనూ అత్యధిక మంది చూసిన ఈవెంట్ ఇదేనని టీమ్ పేర్కొంది. ‘బుక్ మై షో’లో 1 మిలియన్‌కిపైగా, ‘పేటీఎం’లో 1.3 మిలియన్‌కిపైగా లైక్స్ సొంతం చేసుకుంది.
Allu Arjun, #Pushpa2, sukumar
మరో ప్రక్క పుష్ప 2 చిత్రం మెయిన్ టార్గెట్ నార్త్ ఇండియాగా మారింది. ఇప్పటికే నార్త్ లో మన సౌతిండియా సినిమాలు అదరకొడుతున్నాయి. కల్కి కలెక్షన్స్ తో మరోసారి ఆ విషయం ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు అందరి దృష్టీ పుష్ప 2 పై పడింది. ‘పుష్ప ది రైజ్’ మూవీ తెలుగులోనే కాకుండా నార్త్ లో కూడా దుమ్ము దులిపిన సంగతి తెలసిందే.
బన్ని కెరీర్ లోనే భారీ బ్లాక్‍బాస్టర్‌గా నిలిచింది. 2021లో రిలీజైన ఈ మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ గా పేరు తెచ్చుకున్నారు.. అంతే కాదు జాతీయ అవార్డ్స్ లో అల్లు అర్జున్ పుష్ప చిత్రానికి గాను ఉత్తమ నటుడుగా అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించారు. జాతీయ అవార్డు రావడంతో పుష్ప మూవీ క్రేజ్ పాన్ ఇండియా రేంజ్‍లో మారు మ్రోగిపోయింది..