MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • తనకి లైఫ్ ఇచ్చిన రచయిత, కొడుకు మరణంతో డిప్రెషన్ లోకి.. ఇంటికి వెళ్లి చిరంజీవి ఏం చేశారో తెలుసా

తనకి లైఫ్ ఇచ్చిన రచయిత, కొడుకు మరణంతో డిప్రెషన్ లోకి.. ఇంటికి వెళ్లి చిరంజీవి ఏం చేశారో తెలుసా

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొందరు దర్శకులు, రచయితలు కీలకం అని చెప్పొచ్చు. చిరంజీవికి ఎక్కువ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ప్రధానంగా ఉంటారు. రచయితల్లో అయితే పరుచూరి బ్రదర్స్ అనే చెప్పాలి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 28 2024, 09:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొందరు దర్శకులు, రచయితలు కీలకం అని చెప్పొచ్చు. చిరంజీవికి ఎక్కువ హిట్స్ ఇచ్చిన దర్శకుల్లో కోదండరామిరెడ్డి, రాఘవేంద్ర రావు ప్రధానంగా ఉంటారు. రచయితల్లో అయితే పరుచూరి బ్రదర్స్ అనే చెప్పాలి. చిరంజీవి కెరీర్ మలుపు తిరగడానికి ప్రాణం పోసిన రచయితలు పరుచూరి బ్రదర్స్. ఖైదీ చిత్రంతో వీరి కాంబినేషన్ మొదలయింది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఆ తర్వాత కొండవీటి దొంగ, అడవి దొంగ, గ్యాంగ్ లీడర్, ఘరానా మొగుడు నుంచి మొన్నటి సైరా వరకు చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ ది తిరుగులేని కాంబినేషన్. దీనితో చిరంజీవి కెరీర్ లో పరుచూరి బ్రదర్స్ కీలకంగా మారారు. చిరంజీవి బాడీ లాంగ్వేజ్, మ్యానరిజమ్స్, ఇమేజ్ ని బాగా అర్థం చేసుకున్న రచయితలు వీళ్ళు. అందుకే సింక్ అంతబాగా కుదిరింది. 

 

35
Mohan Babu

Mohan Babu

అయితే పరుచూరి బ్రదర్స్ జీవితాల్లో కూడా విషాదాలు ఉన్నాయి. పరుచూరి వెంకటేశ్వరరావు కుమారుడు క్యాన్సర్ కారణంగా చిన్న వయసులోనే మరణించారు. ఆ సమయంలో ఆయన డిప్రెషన్ లోకి వెళ్లారట. ఒకవైపు వృత్తి, మరోవైపు కొడుకు లేదనే బాధతో ఆయన తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. ఉపశమనం కోసం సిగరెట్స్ విపరీతంగా కాల్చడం అలవాటు చేసుకున్నారు. ఈ విషయం చిరంజీవి దృష్టికి వచ్చింది. 

 

45

వెంటనే చిరంజీవి పరుచూరి బ్రదర్స్ ఇంటికి వెళ్లారు. ఓ ఈవెంట్ లో చిరంజీవి ఈ విషయాలని చెప్పారు. చిరంజీవి వెళ్ళినప్పుడు కూడానా పరుచూరి వెంకటేశ్వర రావు సిగరెట్ కాల్చుతున్నారు. నీ బిడ్డ క్యాన్సర్ తో మరణించాడు. క్యాన్సర్ కి ప్రధానమైన కారణాలలో సిగరెట్ కూడా ఒకటి. కొడుకుపై బాధతో సిగరెట్స్ కి బానిసైతే ఎలా ? నీ అవసరం చిత్ర పరిశ్రమకి ఉంది. మీరు పదికాలాలు ఆరోగ్యంగా ఉండాలి.. సిగరెట్ మానేయండి అని చిరంజీవి చెప్పారు. 

 

55
Paruchuri Venkateswararao

Paruchuri Venkateswararao

చిరంజీవి అంతటివాడు చెబితే తిరుగు ఉంటుందా.. ఇప్పుడే మానేస్తున్నా అని చేతిలో ఉన్న సిగరెట్ ని యాష్ ట్రే లో పడేశారట. ఆ విధంగా చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావు చేత చిరు సిగరెట్ మాన్పించారు. చిరంజీవి, పరుచూరి బ్రదర్స్ మధ్య అంత మంచి రిలేషన్ ఉంది. అందుకే పరుచూరి బ్రదర్స్ కూడా పదే పదే చిరంజీవి చిత్రాలని గుర్తు చేసుకుంటుంటారు. 

 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.

Latest Videos
Recommended Stories
Recommended image1
Vishwak Sen Legacy: రాజకీయ వారసత్వాన్ని ఇచ్చిన తండ్రినే ద్వేషించే కొడుకు.. విశ్వక్ సేన్‌ `లెగసీ` వచ్చేది అప్పుడే
Recommended image2
Chiranjeevi: చిరంజీవి సినిమా గాలి తీసిన నటుడు, ఇదేమన్నా భీమవరం అనుకున్నావా..ప్రొడ్యూసర్ స్ట్రాంగ్ వార్నింగ్
Recommended image3
Family Web Series: ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన 5 బెస్ట్ వెబ్ సిరీస్‌లు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved